తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నటుడిగానే కాకుండా చిన్నపిల్లకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అతి కొద్దిమంది మాత్రమే స్టార్ డమ్ తెచ్చుకున్నారు. సినీ రంగంలో సాహసవీరుడుగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ఇండస్ట్రీలోకి బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు. తండ్రితో కలిస పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా మారాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. నేడు మహేష్ బాబు పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మరుపురాని బహుమతి అందించారు. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా తమ అభిమాన హీరోల సినిమా రిలీజ్, పెళ్లి, పుట్టిన రోజు వేడుకలు వస్తే చాలు తెగ సంబరాలు చేసుకుంటారు. ఆ హీరో పేరు మీద సామాజిక సేవాకార్యక్రమాలు, స్వీట్ల పంపిణీ, థియేటర్ వద్ద భారీ కటౌట్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సర్వసాధారణం అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ నట వారుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మాస్, క్లాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాదు.. పలు యాడ్స్ లో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నారు. మహేష్ బాబు నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు, గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు ఆపరేషన్ చేయించడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
తెలుగు ప్రేక్షకులు మహేష్ బాబు అంటే ఎంతగానో అభిమానిస్తారు. మహేష్ బాబు కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏ హీరోకి అయినా పుట్టిన రోజు అంటే స్వీట్లు, దుప్పట్లు ఇతర వస్తువులు పంచుతుంటారు. కొంతమంది రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ కొంతమంది అభిమానులు కాస్త భిన్నంగా ఆలోచించారు. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ వెలుగొందుతున్న మహేష్ బాబు కి ఇప్పుడు మరో స్టార్ యాడ్ చేశారు. అది ఆకాశంలో మిల మిల మెరిసే స్టార్.. అంతేకాదు రిజిస్టర్ చేయింది సర్టిఫికెట్ కూడా పొందారు. నేడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ఆయనకు కానుకగా ఇచ్చారు.
రోటీన్ కి భిన్నంగా తమ అభిమాన హీరోకి ఏకంగా ఆకాశంలో నక్షత్రాన్ని ఆయన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించి మరీ ఇవ్వడం ఇప్పటి వరకు ఏ హీరోకి జరగలేదని అంటున్నారు. నిజంగా తమ అభిమాన హీరోకి జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 9 నుంచి ఆ స్టార్‌ను మహేష్ బాబు అని పిలుస్తారని అంటున్నారు. నిజంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక నటుడి పేరు నక్షత్రానికి పెట్టడం ఇదే తొలిసారి.. తమ అభిమాన హీరోపై ప్రేమను చాటుకోవడానికి హార్డ్ కోర్ అభిమానులు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆకాశంలో నక్షత్రానికి మహేష్ బాబు పేరు రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఒక రిజిస్ట్రేష్ కార్డు కూడా సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ కార్డు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
With a special honor, for the first time in TFI,an actor’s name now graces a registered star, and its coordinates are proudly displayed on the certificate. This cherished tribute celebrates the beloved Superstar @urstrulymahesh, birthday today.
This was exceptional gift by… pic.twitter.com/tXTC9KvXbs
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) August 9, 2023