ప్రమాదాలు ఏ మూల నుంచి పొంచి వస్తాయో తెలియదు.. ఇటీవల తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ ఫైర్ అయి తీవ్ర గాయాలు పాలైన పోలీసులు ఉన్నారు. కొన్ని చోట్ల చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
మనిషికి ప్రమాదాలు, మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవాళ్లు ప్రమాదాలకు గురై ఆస్పత్రిలో చేరిన వార్తలు వింటుంటాం. సాధారణంగా పోలీస్ స్టేషన్ లో తుపాకీ క్లీన్ చేస్తుంగా ప్రమాద వశాత్తు మిస్ ఫైర్ అయి తీవ్రంగా గాయపడ్డ కేసులు ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సిద్దిపేట పట్టణంలో ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో తుపాకీ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ కుడి కన్నుకు గాయం అయ్యింది. వెంటనే రాజశేఖర్ ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిద్దిపేట ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో 2013 బ్యాచ్ కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తుపాకులు క్లీన్ చేస్తుండగా అందులో ఓ తుపాకి మిస్ ఫైర్ అయినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించారు.
ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గన్స్ శుభ్రం చేసే సమయంలో ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో గన్ మిస్ ఫైర్ అయి ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయని అధికారులు అంటున్నారు.