యూపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ కి ఎలక్షన్ కమీషన్ నోటీసులు జారీ చేసింది. యూపి ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లను ఉపయోగిస్తానని అన్న రాజా సింగ్, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడం.. ఎన్నికలపై ప్రభావం చూపుతుందని.. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈసీ వివరణ కోరింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని రాజాసింగ్ కి ఎన్నికల సంఘం ఆదేశించింది.
కాగా, నిన్న యూపీలో ఉండాలంటే.. యోగీకి జైకోట్టాల్సిందే అని, యోగీ కి ఓటేయాల్సిందే అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ యూపీ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే బీజేపీకి ఓటేయకుంటే.. జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అవి ఎవరికోసమో తెప్పిస్తామో అందరికి తెలిసే ఉంటుందని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఉండాలంటే.. యోగీ అనాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది.