టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తూ తిరుగులేని హీరోగా ఎదిగారు. సినిమాలు చేస్తూనే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, సమాజ సేవలో భాగమవ్వడం అలవర్చుకున్నారు. పేదల కష్టాలను పోగొట్టి వారి జీవితాల్లో ఆనందం నింపాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.

స్వంతంగా రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని బావించారు. ఇదే క్రమంలో 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ గుర్తుగా గాజు గ్లాసును భారత ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే ఆ పార్టీ గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నది. పలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును కోల్పోవాల్సి వచ్చింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి షాక్ ఇచ్చింది. పార్టీ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం తగినన్ని ఓట్లు, సీట్లు సాధించలేకపోవడం వల్లే ఈసీ జనసేన పార్టీ గర్తును ఫ్రీ సింబల్ కేటగిరిలో పెట్టినట్లుగా తెలుస్తోంది మరోవైపు 2024ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీకి సిద్దమవుతున్న జనసేనకు ఊహించని షాక్ తగిలింది.
రాజకీయ పార్టీ ప్రాంతీయ , జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నియమాల ప్రకారం కొన్ని సీట్లను గెలవాలి. ఆ పార్టీకి పోలైన ఓట్ల శాతాన్ని కూడా లెక్కగడతారు. గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం, గెలుచుకున్న సీట్లను ఆధారంగా చేసుకొనే ఎన్నికల గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గత శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో జనసేనకు 6శాతం ఓట్లు రావాలి. దీంతో పాటుగా రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి. ఇవి రెండు జరిగితేనే ఆపార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభించేది. జనసేన పార్టీ గత ఎన్నికల్లో 6శాతం ఓటు శాతం వచ్చినప్పటికి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవడంతో ఫ్రీ సింబల్ కేటగిరిలోకి వెళ్లిపోయింది. ఎపిలోని 25లోక్‌సభ స్థానాల్లో ఒక్క ఎంపీ సీటు గెలిచినా ప్రాంతీయ పార్టీ హోదా దక్కేది. మరి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాసును కేటాయిస్తదో లేదో వేచి చూడాల్సిందే.