బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ మారబోతున్నారని తెలుస్తోంది. ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఇటీవలే వివాదస్పద వ్యాఖ్యలు చేశారని ఆయనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనంకు వెళ్లిన రాజాసింగ్.. మీడియా ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే రాజా సింగ్ అనగానే చాలా మందికి వివాదాస్పదమైన వ్యాఖ్యలే గుర్తొస్తాయి. గతేడాది మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి రాజా సింగ్ పై కేసు నమోదు అయ్యింది.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు సంబవిస్తున్నాయని అధికారులు అంటున్నారు.
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ను చికోటి ప్రవీణ్ కుమార్ కలిశారు. ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజాసింగ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈక్రమంలో ఎమ్మెల్యేను కలిసేందుకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ను కలిసిన చికోటి ప్రవీణ్…ఆయనకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి.. ఆయన్ను పరామర్శించిన చికోటి ప్రవీణ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే భవిష్యత్తులోనూ కొనసాగితే.. హిందువులు […]
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెలంగాణ హైకోర్టులో ఉపశమనం లభించింది. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి విడుదల సందర్భంలో ఆయన కుటుంసభ్యులు మాత్రమే ఆయనతో ఉండాలని స్పష్టం చేసింది. ప్రెస్‌మీట్‌లు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయోద్దని రాజాసింగ్‌ను హెచ్చరించింది. అంతేకాదు! సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని కండీషన్ పెట్టింది. కాగా, రాజాసింగ్‌న ఆగస్టు 25న ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ […]
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసుకు సంబంధించి విచారణ ఇవాళ తెలంగాణ హైకోర్టులో జరిగింది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసు పెట్టడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య ఉషా బాయి సింగ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, జస్టిస్ జె. శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజాసింగ్ తరపు లాయర్ రామచంద్రరావు, ప్రభుత్వ […]
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ క్రమంలో రాజాసింగ్ ని అరెస్టు చేసిన పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే అరెస్ట్ చేయాడానికి ముందే ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇంట్లో పీడీ యాక్ట్ నోటీలుసు ఇచ్చారు. పీడీయాక్ట్ నమోదును పోలీసులు బోర్డు ముందు పెట్టనున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పీడీయాక్ట్ బోర్డు సమావేశం […]
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఎమ్మెల్యే రాజా సింగ్ ను అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ రాజాసింగ్ ను ఆయన ఇంటి నుంచి తరలించారు. హేట్ స్పీచ్ పై పలు సెక్షన్ల కింద రాజాసింగ్ పై కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ కు 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి నోటీసులు […]
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా తనని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు పది రోజుల గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 2లోగా తన వివరణను పంపాలంటూ బీజేపీ హైకమాండ్ డెడ్‌లైన్ పెట్టింది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ హైదరాబాద్‌లో షో ఏర్పాటుని మొదటి నుంచి రాజాసింగ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులకు సైతం విజ్ఞప్తి చేశారు. […]