సాధారణంగా ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే.. వారికి ముందుగానే కౌన్సిలింగ్ ఇస్తుంటారు. పేషెంట్ కి తప్పని సరి పరిస్థితుల్లోనే ఆపరేషన్ చేయడానికి వైద్యులు సమాయత్తం అవుతారు.. ఆపరేషన్ చేయించుకోవడం వల్ల పేషెంట్ కి ఆరోగ్యం బాగుపడుందని ముందుగానే ప్రిపేర్ చేస్తుంటారు. ఓ వృద్ద మహిళకు స్పృహలో ఉండగానే మెదడులోని ట్యూమర్ తొలగించి ఔరా అనిపించుకున్నారు వైద్యులు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వృద్దురాలు గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది. న్యూరాలజీ వైద్యులు ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయాలని.. లేకుంటే అది ప్రమాదంగా మారి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆమెకు ఆపరేషన్ చేశారు. ఆమెకు అనస్తీషియా ఇస్తే.. ఫిట్స్ గానీ పెరాలసిస్ గాని రావొచ్చు అన్న ఉద్దేశంతో.. అవేక్ క్రేనియటోమీ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో ఆపరేషన్ కి ముందు ఆ వృద్దురాలికి వైద్య సిబ్బంది ఆమెకు ఎంతో ధైర్యాన్ని నింపారు.. ఆపరేషన్ చేసే పద్దతి కూడా ఆమెకు తెలియజేసి ఎంతో నమ్మాకాన్ని పెంచారు. ఆమెకు ఆపరేషన్ చేసే సమయంలో మెదడు పై భాగాన్ని తెరచి సర్జరీ చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఆమె టెన్షన్ తో స్పృహలో కోల్పోకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె తనకు చిరంజీవి, నాగార్జున అంటే ఎంతో ఇష్టం అని తెలిపింది.
వెంటనే ఓ ట్యాబ్ తీసుకు వచ్చి సినిమా చూపించారు. అలా ఆమె సినిమా చూస్తూ.. మాట్లాడుతూ ఉన్న సమయంలోనే దాదాపు రెండు గంటల సమయం తీసుకొని బెయిన్ లో ఉన్న కణితి(ట్యూమర్)ని తొలగించారు వైద్యులు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.