మధ్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ లో వైన్స్ షాపులు, బార్లు అన్నీ బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు వైన్స్ బంద్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ వివరాలు మీకోసం.
మధ్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో మధ్యం షాపులు మూతపడనున్నాయి. ఆ రెండు రోజులు వైన్స్ బంద్ చేయాలని అధికారులు నిర్ణయించారు. వరుసగా రెండు రోజులు నగరంలో వైన్స్ బంద్ కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మధ్యం షాపులు, బార్లు మూసివేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. దీంతో మధ్యం చుక్క లేకపోతే ఉండలేని మధ్యం ప్రియులకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది. నగరంలో జరుగబోయే ఆ వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఈ చర్యకు పూనుకున్నారు. అసలు మధ్యం షాపులు ఎప్పటి నుంచి బంద్ కానున్నాయి? కారణమేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలో అషాడ మాసంలో వచ్చే బోనాల పండుగ సందడి మొదలైంది. హైదరాబాద్ లో లష్కర్ బోనాల పండుగను అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. భోనాల వేడుకలను అట్టహాసంగా జరిపేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. కాగా లష్కర్ భోనాల పండుగను పురస్కరించుకుని నగరంలో రెండు రోజులపాటు మధ్యం షాపులు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వైన్స్ బంద్ కానున్నాయి. ఆదివారం(జూలై 09) ఉదయం 6 గంటల నుంచి జూలై 11వ తేదీ ఉదయం ఆరుగంటల వరకు వైన్స్ మూతపడనున్నాయి. సికింద్రాబాద్ ఏరియా పరిధిలోని గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, బోయిన్ పల్లి, గోపాల పురం, తుకారం గేట్, మారేడ్ పల్లి, మహంకాళి, రాంగోపాల్ పేట, మార్కెట్ పిఎస్, తిరుమలగిరి, కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలో వైన్స్ షాపులు, బార్లు అన్నీ బంద్ కానున్నాయి.