ఫిలిం నగర్ భూ వివాదంలో దగ్గుబాటి కుటుంబానికి తలనొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే దీనిపై కోర్టుకు హాజరయ్యాడు రానా. ఇక తాజాగా ఈ వివాదానికి సంబంధించి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అది ఏంటంటే..
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. వీరికి సంబంధించి ఓ భూవివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ కేసుకు సంబంధించి రానా.. కోర్టుకు కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో తాజాగా అదే వివాదానికి సంబంధించి.. రానా, సురేష్ బాబులపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. దగ్గుబాటి సురేష్ బాబుకి ఫిలింనగర్‌లో 2200 గజాల స్థలం ఉంది. ఈ ల్యాండ్‌ని 2014లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి అగ్రిమెంట్ ప్రకారం లీజుకు ఇచ్చారట దగ్గుబాటి ఫ్యామిలీ. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి లీజు అగ్రిమెంట్‌ను రెన్యూవల్ చేస్తూ వస్తున్నారట. ప్రస్తుతం ఆ స్థలం ఇంకా లీజు అగ్రిమెంటులోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఆ స్థలంలోని 1000 గజాలను హీరో దగ్గుబాటి రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. లీజు కొనసాగుతుండగానే అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేశారని గతంలోనే సదరు వ్యాపారి ఫిర్యాదు చేశాడు.
ఇక తాజాగా ఇదే ల్యాండ్ వివాదానికి సంబంధించి సురేష్ బాబు, రానాలు తనను బలవంతంగా రౌడీల సాయంతో ఖాళీ చేయించారని.. అంతేకాక తన అంతు చూస్తానని సురేష్ బాబు తనను బెదిరించారని సదరు వ్యాపారి తెలిపాడు. దీని గురించి ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో.. తాను కోర్టును ఆశ్రయించాను అన్నాడు. ఈ క్రమంలో తాజాగా ల్యాండ్ వివాదానికి సంబంధించి రానా, సురేష్ బాబులపై క్రిమినల్ కేసు నమోదు కావడమే కాక.. వారు విచారణకు హాజరు కావాలంటూ.. కోర్టు సమన్లు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రానా ఎలా స్పందిస్తాడో చూడాలి. మరి ఈ వివాదాంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.