హలో మ్యాగజైన్ అనే సినిమా పత్రిక గురించి చాలా మంది సినీ ప్రేక్షకులకి తెలుసు. ఆ మాగజైన్ పై దేశ విదేశాలకి చెందిన సినిమాల్లోని సెలబ్రిటిల పిక్స్ తో మ్యాగజైన్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది.
హలో మ్యాగజైన్ అనే సినిమా పత్రిక గురించి చాలా మంది సినీ ప్రేక్షకులకి తెలుసు. ఆ మాగజైన్ పై దేశ విదేశాలకి చెందిన సినిమాల్లోని సెలబ్రిటిల పిక్స్ తో మ్యాగజైన్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. ఆ మ్యాగజైన్ ఇప్పటివరకు తమ కవర్ పిక్చర్స్ గా ఎంతోమంది హీరోయిన్స్ ఫొటోస్ ని ప్రచురించింది . తాజాగా ఒక లేడీ కవర్ పిక్స్ తో తమ మ్యాగజైన్ ని ప్రచురించింది. ఆ మ్యాగజైన్ లో ఉన్న లేడీ ని చూసి ఎవరు ఈ హీరోయిన్ అని ఎంక్వయిరీ చేసి చివరకి పలానా అని తెలుసుకొని షాక్ అయ్యారు.
దగ్గుబాటి రానా..వెంకటేష్ నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపట్టి బాహుబలితో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అడపా దడపా హిందీ సినిమాల్లో కూడా నటిస్తు తన నటనకి ఉన్న పవర్ ని ప్రేక్షుకులకి తెలియచేస్తున్నాడు.మూడు సంవత్సరాల క్రితం రానా హైదరాబాద్ కి చెందిన మిహిక బజాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇంటీరియర్ డిజైనర్ అయిన మిహికకి ఇంటీరియర్ కి సంబంధించిన సొంత కంపెనీ కూడా ఉంది.
తాజాగా ఎప్పుడు సినిమా వాళ్ళ పిక్స్ ని మాత్రమే తమ మ్యాగజైన్ ముఖ చిత్రం గా ముద్రించే హలో మ్యాగజైన్ తమ కవర్ పిక్ మీద దగ్గుబాటి రానా సతీమణి మిహిక బజాజ్ పిక్ ని ప్రచురించింది. ఆ పిక్ ని చూసిన వాళ్ళందరూ ఇప్పడొస్తున్న హీరోయిన్ ల కి ఏ మాత్రం తీసిపోని అందంతో మిహిక ఉందని పొగుడుతున్నారు. ఫ్లోరెల్ లెహంగా తో పాటు ఆరంజ్ కలర్ శారీలో మిహిక ఎంతో అందంగా ఉంది. గత కొంత కాలం క్రితం మిహిక ప్రెగ్నెసీ అయ్యిందనే రూమర్ ఒకటి బయటికి వచ్చింది. తాను ప్రెగ్నెంట్ అనేది రూమర్ అని తాను ప్రెగ్నెంట్ ఐతే దాచుకోకుండా అందరికి చెప్తానని మిహిక అంది. దీంతో మిహిక ప్రెగ్నెంట్ అని ఇన్నిరోజులు నుంచి వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పడింది.