ఆరేళ్లుగా యాదాద్రి నరసింహుని దివ్వదర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు మార్చి 28 నుంచి ఆ భాగ్యం కలుగనుంది. మార్చి 28 న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ తర్వాత నుంచి భక్తులకు యాదాద్రి నృసింహుడు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఘట్టంలో కీలకమైన మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇది కూడా చదవండి: యాదాద్రి ఆలయ నిర్మాణంలో భాగమైన ముస్లిం శిల్పులు!
దివ్య విమాన గోపురంపై ఉన్న శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం 11.55 గంటలకు మిథున లగ్నంలో ఈ మహోత్సవం జరిగింది. దీనిలో భాగంగా శ్రీ సుదర్శన చక్రానికి యాగజలాలతో సంప్రోక్షణ చేశారు. ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. ఏడు గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు. ఆలయ రాజగోపురంపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది. అనంతరం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్.. ప్రొటోకాల్ పాటించలేదంటూ మండిపాటుమరో వైపు ఇదే సమయంలో మిగిలిన ఆయల గోపురాలకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రుల ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి గర్భాలయంలోని మూలవిరాట్టుల దర్శనం మొదలయ్యింది. సీఎం కేసీఆర్ దంపతులు స్వామి వారికి తొలి పూజ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సర్వ దర్శానికి భక్తులను అనుమతిస్తారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా, ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: RRR సినిమాపై MLA సీతక్క సంచలన వ్యాఖ్యలు!