తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్మించిన సంగతి తెలిసిందే. ఈ పునర్నిర్మాణం జరిగాక మాడ వీధులు, రాజగోపురాలు భక్తులకు కన్నుల విందు కలిగిస్తున్నాయి. రాత్రి పూట రంగురంగుల లైట్ల మధ్య స్వామి వారిని చూసి మన యాదాద్రేనా అన్నట్లుగా భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా హెలికాప్టర్లు.. చాపర్లు వంటి వాటిని సినీ, సెలబ్రిటీలు వాడుతుంటారు. వ్యాపారవేత్తలు కూడా కొనుగోలు చేస్తారు. కాకపోతే.. వారికి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రావు. ఘీ క్రమంలో తాజాగా కరీంనగర్ వాసి ఒకరు హెలికాప్టర్ కొనుగోలు చేయడం.. ప్రస్తుతం సంచలనంగా మారింది. సదరు వ్యక్తి.. కొనుగోలు చేసిన హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు.. యాదగిరిగుట్టకు తీసుకు వచ్చాడు. ఇక యాదాద్రిలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌కు పూజలు నిర్వహించడం ఇదే ప్రథమం. దాంతో జనాలు పెద్ద ఎత్తున […]
ప్రజా గాయకుడుగా ఎనలేని కీర్తి ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్. ఇంజనీరింగ్ చదివినప్పటికి.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం కోసం ఆ జీవితాన్ని వదులుకున్నారు. పాటనే ఆయుధంగా చేసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. అలాంటి గద్దర్ పేరు వినిపించగానే మనకు.. మెడలో ఎర్ర కండువా, చేతిలో కర్ర, తెల్ల పంచా, నెరిసిన జుట్టుతో ఉన్న రూపే కళ్ల ముందు కదలాడుతుంది. ఇప్పటివరకు ఆయనను ఎప్పుడూ మోడ్రన్ దుస్తుల్లో చూడలేదు. తనదైన […]
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో అడవి పంది కలకలం సృష్టించింది. శనివారం ఉదయం క్యూకాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటూ పరిగెత్తింది. ఇక ఈ క్రమంలో అక్కడి భక్తుల అరుపులకు భయపడిన పంది.. తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పై అటు ఇటు పరిగెత్తింది. ఆ పందిని పట్టుకునేందుకు ఎస్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికి వారికి చిక్కకుండా క్యూకాంప్లెక్స్ వీధుల్లో పరిగెత్తింది. వారి నుంచి తప్పించుకునే […]
ఆరేళ్లుగా యాదాద్రి నరసింహుని దివ్వదర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు మార్చి 28 నుంచి ఆ భాగ్యం కలుగనుంది. మార్చి 28 న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ తర్వాత నుంచి భక్తులకు యాదాద్రి నృసింహుడు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఘట్టంలో కీలకమైన మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. […]
ఆరేళ్లుగా యాదాద్రి నరసింహుని దివ్వదర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు మార్చి 28 నుంచి ఆ భాగ్యం కలగనుంది. మార్చి 28 న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ తర్వాత నుంచి భక్తులకు యాదాద్రి నృసింహుడు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. […]
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయం త్వరలో ప్రారంభం కానుంది. యాదాద్రీశుడి స్వయంభువుల దర్శన భాగ్యం భక్తులకు త్వరలో కలగనుంది. ప్రధానాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా మహాకుంభ సంప్రోక్షణ మార్చి 28న ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం మేరకు ముందస్తు పనులు ప్రారంభించారు. ఈ నెల 28న ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహకుంభ సంప్రోక్షణతో ఆలయ […]
హైదరాబాద్- తెలంగాణలో ప్రఖ్యాత దేవస్థానం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునప్రారంభోత్సవానికి కంగం సిద్దం అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యాదాద్రి దేవస్థాన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. ఆదివారం సాయంత్రం ముచ్చర్లలోని ఆశ్రమంలో జరిగిన వీరి చర్చల్లో మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేశారు. మహా […]
యాదాద్రి- తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. యాదాద్రి ఆలయ పున: ప్రారంభ తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 28 మార్చి 2022న యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణతో ఆలయ పున:ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మహా సంప్రోక్షణకు 8 రోజుల ముందు నుంచీ సుదర్శన యాగం నిర్వహిస్తామని తెలిపారు. కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం పది వేల మంది రుత్విక్కులతో యాగం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంగళవారం యాదాద్రి […]