బీఆర్ఎస్ నేత.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై గత ఏడాది హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటన మరువక ముందే మరోసారి ఆయనపై హత్యాయత్నానికి కుట్ర జరిగింది..
గత ఏడాది ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి చొరబడటంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయి అతన్ని పట్టుకున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ప్రసాద్ తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఎమ్మేల్యే జీవన్ రెడ్డిపై మరోసారి హత్యాయత్నం జరిగింది.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు. ఈ క్రమంలో నిజామాబాద్ లో ఓ మహిళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవిన్ రెడ్డిపై మరోసారి హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. అయితే ఈసారి హత్యాయత్నానికి ప్లాన్ చేసింది మహిళా అని దర్యాప్తులో తెలింది.. అంతేకాదు ఆమె ఇంట్లో తనిఖీ చేయగా 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటోనేటర్లు బయటపడ్డాయి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ న్యూ హౌజింగ్ కాలనీలో బొంత సుగుణ అనే మహిళ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ కేసు లో బొంత సుగుణ పలు సంచలన విషయాలు బయటెట్టింది. మక్లూర్ మండలం కల్లెడకు చెందిన ప్రసాద్ గౌడ్ జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్‌లు తన ఇంట్లో దాచమని చెప్పాడని.. అసరం ఉన్నపుడు వాటిని ఉపయోగించాలని చెప్పాడని వెల్లడించింది.
గతంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన కేసులో ప్రసాద్ గౌడ్, సుగుణ నిందితులుగా ఉన్నారు. జీవన్ రెడ్డిపై తుపాకితో కాల్చేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. ఈ కేసులో ప్రసాద్ గౌడ్ తుపాకీ కొనుగోలు చేయడానికి బొంత సుగుణ డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవల బెయిల్ పై వచ్చిన తర్వాత సుగుణతో కలిసి ప్రసాద్ గౌడ్ పెలుడు పదార్థాలను తెప్పించి ఆమె ఇంట్లో భద్రపరిచినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రసాద్ గౌడ్ జైల్లో ఉన్నాడు. మరోసారి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చేసేందుకు కుట్ర చేసిన బొంత సుగుణతో పాటు ప్రసాద్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.