ఇండియాలో జరిగే ఎటువంటి పోటీ పరీక్షల్లో అయినా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ ఎవరనే క్వశ్చన్ ని ఇస్తే అందరూ టక్కున అల్లు అర్జున్ అనే ఆన్సర్ ని ఫిల్ చేస్తారు.. ఇండియా వ్యాప్తంగా అంత క్రేజ్ ఉన్ననటుడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తాజాగా నల్గొండ జిల్లాకి వెళ్లడం జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు తెలంగాణ రాష్త్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.
అల్లు అర్జున్.. ఈ పేరు వింటే చాలు అభిమానులు పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోతారు. అందరికి ఫాన్స్ ఉంటారు కానీ అల్లు అర్జున్ కి మాత్రం ఫాన్స్ తో కూడిన ఆర్మీ ఉంటుంది. అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ని డ్రెస్ స్టైల్ ని ఫాలో అయ్యే అభిమానులు లక్షల్లోనే ఉంటారు. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా రికార్డులని వాష్ చేస్తూ తన పేరు మీద రికార్డులని భద్రంగా ఉంచుకోవటం లో అల్లు అర్జున్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. లేటెస్ట్ గా పుష్ప మూవీ తో పైన చెప్పుకున్నట్లే చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ సినిమా కి తన అవసరం ఎంత ఉందో చెప్పాడు
అల్లు అర్జున్ నల్గొండ జిల్లా కి చెందిన కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి కూతురు స్నేహారెడ్డి ని పెళ్లి చేసుకున్నాడనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా చంద్రశేఖర్ రెడ్డి నల్గొండ జిల్లాలోని తన స్వగ్రామం చింతపల్లి కి దగ్గరలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా భట్టుగూడెం జంక్షన్ వద్ద కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఫంక్షన్ హాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది .ఈ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా జరిగింది. తమ అభిమాన కధానాయకుడు అల్లు అర్జున్ ని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావటంతో ఆ ప్రాంతమంతా ఇసుకేస్తే రాలనంత జనం తో నిండిపోయింది. పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తుని ఏర్పాటు చేసారు.
ఇంక అసలు విషయానికి వస్తే.. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి గతం లో బిఆర్ఎస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ ఎలక్షన్ లో అల్లు అర్జున్ తన మామ చంద్రశేఖర్ రెడ్డి తరుపున ప్రచారం చేయలేదు. కానీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో బి ఆర్ ఎస్ పార్టీ తరుపున నా సొంత నియోజక వర్గం లో పోటీచేస్తానని నాకు మద్దతుగా నా అల్లుడు అల్లు అర్జున్ కూడా ప్రచారం చేస్తాడని చంద్రశేఖర్ రెడ్డి చెప్పాడు. దీంతో రాజకీయ వర్గాల్లో అలజడి మొదలయింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ కి రావటానికి ముందే చంద్ర శేఖర్ రెడ్డి ఆ మాటలన్నీ చెప్పాడు. దీంతో అల్లు అర్జున్ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ కి వచ్చి ఏం మాట్లాడుతాడో అని అందరూ అనుకున్నారు.
కానీ అల్లు అర్జున్ రాజకీయ పరంగా ఏమి మాట్లాడలేదు. కానీ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం నా అల్లుడు అల్లు అర్జున్ రాబోయే ఎలక్షన్స్ లో నాకోసం ప్రచారం చేస్తాడని ఖరాకండిగా చెప్పాడు. అదే జరిగితే రాజకీయంగా పెను మార్పులు జరగడం ఖాయం అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే బి ఆర్ ఎస్ పార్టీ తరుపున పోటీ చేసే తన మావయ్య చంద్రశేఖర్ రెడ్డి గెలుపు కోసం అల్లు అర్జున్ లాంటి ఐకాన్ స్టార్ ప్రచారం చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీచేసే బిఆర్ఎస్ అభ్యర్థులతో పాటు బిఆర్ఎస్ పార్టీ కి కూడా చాలా లాభమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.