అయ్యప్ప స్వామి గురించి ఓయూ స్టూడెంట్ భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హిందూ దేవుళ్లపై.. మరీ ముఖ్యంగా అయ్యప్ప దేవుడు పుట్టుకపై నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేస్తున్నారు. నరేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నరేష్‌పై కొడంగల్ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.
ఈ నేపథ్యంలో అయ్యప్ప మాలధారులు.. కొడంగల్ భైరి నరేష్ సభకు హాజరైన వారి కోసం గాలిస్తున్నారు. వారి చిరునామాలు తెలుసుకుని.. ఇళ్లకు వెళ్లి మరి అటాక్ చేస్తున్నారు అయ్యప్ప భక్తులు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేంజర్ల రాజేష్‌ను తమకు అప్పగించాలంటూ ఇంటిని ముట్టడించారు. రేంజర్ల ఇంటి ముందు అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక రెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన అంబేద్కర్ సభలో భైరి నరేష్.. అయ్యప్ప స్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.
ఇక ఈ వీడియో తెలంగాణ వ్యాప్తంగా వైరల్ కావడంతో అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేష్‌పై మండిపడుతున్నారు. మేం నాస్తికులం.. దేవుడిని నమ్మం.. అంబేడ్కర్ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నరేష్. అయ్యప్ప స్వామి జననాన్ని, పురాణాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. భైరి నరేష్‌పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి హిందూ దేవుళ్లను తిట్టడం ఫ్యాషన్‌గా మారిందని.. వెంటనే పబ్లిసిటీ రావాలంటే హిందూ దేవళ్లను తిట్టడమే మార్గం అని కొందరు భావిస్తున్నారంటూ అయ్యప్ప భక్తులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ సమాజం ఏకం కావాలన్నారు. దేవతల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. పాపులారిటీ కోసమే ఇలాంటి వారు హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.