ఈ రోజుల్లో చాలా మంది ప్రతీ చిన్న సమస్యకు పరిష్కారమే లేదన్నట్లుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల ఓ యువకుడు అందంగా లేనని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
నేటి కాలం యువతి యువకులు ప్రతీ చిన్న సమస్యకు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడని, పరీక్షలు ఫెయిల్ అయ్యానని.. ఇలా రకరకాల కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతూ చివరికి కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఓ యువకుడు అందంగా లేనని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వినటానికి షాకింగ్ ఉన్న ఇది నిజం. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం కొల్లంపల్లి పరిధిలోని నల్లగుట్టతండా. ఇక్కడే సురేష్ (23) అనే యువకుడు నివాసం ఉండేవాడు. స్థానిక పట్టణంలో ఇంటర్ వరకు చదివి అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. అయితే సురేష్ నోట్లోని పళ్లు కాస్త ఎత్తుగా ఉండేవి. దీంతో ఇతడిని చూసి గ్రామంలోని చాలా మంది హేళన చేసి మాట్లాడేవారు. గ్రామస్తులు, స్నేహితులు అలా అనడంతో సురేష్ అవమానంగా భావించి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఇక ఈ గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ సురేష్ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అందంగా లేనని ఆత్మహత్య చేసుకున్న యువకుడి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.