శబరిమలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఒక బస్సు బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 68 మంది ఉన్నారని తెలుస్తోంది. మిగిలిన వివరాలు..
ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. కొన్నిసార్లు డ్రైవర్ల నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్, ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొన్ని ఘటనల్లో పాదచారుల తప్పిదాల వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిన ప్రమాదాల గురించి కూడా వార్తల్లో వింటూనే ఉన్నాం. అలాగే పుణ్యక్షేత్రాలకు దర్శనం కోసం వెళ్లిన వాహనాలు ప్రమాదాలకు గురైన ఘటనలూ ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ప్రమాదమే చోటుచేసుకుంది.
కేరళలోని శబరిమల ప్రాంతంలో ఓ బస్సు బోల్తా పడింది. అయ్యప్ప దర్శనం ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నీలక్కల్ దగ్గర బస్సు అదుపు తప్పడంతో యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 68 మంది ఉన్నారని తెలిసింది. వీరిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. గాయపడిన వారిని పథానంతిట్ట ఆస్పత్రికి తరలించామని కేరళ పోలీసులు తెలిపారు. వీళ్లంతా తమిళనాడుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
At least 62 people were injured, some seriously, as a bus carrying Sabarimala pilgrims from Tamil Nadu fell into a gorge in Pathanamthitta. Read more here#TamilNadu #Sabarimala #BusAccident https://t.co/7UAStjnz92
— The Telegraph (@ttindia) March 28, 2023