హిందువుల ఆరాధ్యదైవం శబరిమల అయ్యప్పస్వామి పుట్టుకను కించపరిచి ప్రజలు చేతిలో తన్నులు తిన్న తెలంగాణ నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ కు ప్రమోషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అతడి సేవలు మెచ్చి భారత నాస్తిక సమాజం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి లభించినట్లు కథనాలు వస్తున్నాయి.
అయ్యప్పస్వామి పుట్టుకను కించపరుస్తూ హిందూ దేవుళ్లు, దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి ప్రజలు చేతిలో తన్నులు తిన్న తెలంగాణ నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ అందరికీ విదితమే. ఇప్పిటికే ఈ వ్యవహారంలో అతడిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు తగ్గనే లేదు. ఇలాంటి సమయంలో అతడి సేవలు మెచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ వచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. ‘భారత నాస్తిక సమాజం జాతీయ ప్రధాన కార్యదర్శిగా భైరి నరేష్’ను ఎన్నుకున్నామని ఆ సంఘం వ్యవస్థాపకుడు జయగోపాల్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
కొద్దిరోజుల క్రితం అయ్యప్పస్వామి పుట్టుకను కించపరుస్తూ బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయ్యప్ప భక్తులు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధుల అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ కనిపెడితే అక్కడ కొట్టబోయారు. అందుకు సంబంధించిన ఎన్నో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఒకానొక సమయంలో ప్రజల నుంచి అతడిని రక్షించలేక పోలీసులే తలలు పట్టుకున్నారు. అలాంటి మహామేధావికి ప్రమోషన్ ఇస్తే నాస్తిక సమాజం గురుంచి మరింత మందికి తెలుస్తుందన్న ఉద్దేశ్యంతో అతడిని భారత నాస్తిక సమాజం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని ఆ సంఘం వ్యవస్థాపకుడు జయగోపాల్ తెలిపారు. ఈ నెల 12న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
ఇదిలావుంటే, నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్ష పదవి నుంచి బైరి నరేష్‌ను తొలగించినట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ ప్రకటన చేశారు. భైరి నరేష్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా, తన సొంత అజెండాతో పనిచేశాడని, ఆర్థిక ఉల్లంఘనలకు సైతం పాల్పడ్డాడని ఆయన తెలిపారు. అందువల్ల క్షమశిక్షణా రాహిత్యం కింద అతడిని అధ్యక్ష పదవి నుంచి తొలగించాం.. అని ఉప్పులేటి నరేష్ తెలిపారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు . భైరి నరేష్ కు ప్రమోషన్ రావడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.