దేశంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా రెండు తెలుగు రాష్ట్రాలలో వందల మందిని బలి తీసుకుంది. ఇలాంటి సందర్భంలో కూడా అసలు కరోనా అంటే ఏమిటో తెలియని వారు ఉంటారా? తమకి కరోనా సోకినా అసలు ఉందని, అది ప్రాణాంతకం అని కూడా వారికి తెలియదంటే నమ్ముతారా? చైనా వైరస్ కి చిక్కకుండా విజయగర్వంతో నవ్వులు చిందిస్తున్న ఆ స్వచ్ఛమైన మనుషులే వరంగల్ లోని ఏటూరునాగారం గూడెంకి చెందిన ఆదివాసీలు. 15 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన వీరంతా ఇక్కడే సెటిల్ అయ్యారు. పక్కా ఇళ్లు లేకున్నా గూనపెంకులు, మట్టి గోడలను నిర్మించుకొని సావాసం చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనం సాగించే వీరికి కరోనా అంటే కొత్తగా వచ్చిన జ్వరం అని మాత్రమే తెలుసు.! ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కోవిడ్.. ఆ గూడెం పొలిమేర కూడా ఇప్పటి వరకు అడుగు పెట్టలేకపోయింది. మీ గూడెంలో ఎవరికైనా కరోనా వచ్చిందా.. అంటే రాలేదు.. రాదు ధీమాగా చెబుతున్నారు ఈగూడెం వాసులు. కరోనా అంటే తెలుసా? అంటే కొత్తగా వచ్చిన జ్వరం కదా అని వారు చెప్పే అమాయకపు మాటలు వింటే ఎవ్వరికైనా నవ్వు ఆగదు.
అతి భయంకరమైన చైనా వైరస్ ని వీరు ఉట్టి జ్వరంగా భావించడం విశేషం. ఇదే కాకుండావీరిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. అడవి తల్లి ఒడిలో ఉన్న తమని ఏ క్రిమి కీటకాలు ఏమి చేయలేవని ఈ ఆదివాసుల నమ్మకం. వీరికి ఏదైనా వ్యాధులు వస్తే చెట్ల పసర్లు, మంత్రాలతోనే నయం చేసుకుంటుండం విశేషం. ఇక వీరి ఆహారపు అలవాట్లు కూడా ఇంతే పద్దతిగా ఉంటాయి. వీరు అడవిలో ప్రవహించే వాగు నీటినే తాగుతారు. ఇప్ప పువ్వులను వండుకొని తింటారు. గంజి, అంబలి, లద్దా లాంటివి సేవిస్తారు. ఇప్ప పువ్వు సారను తాగుతుంటారు.ఇక అడవిలోదొరికే నల్లగడ్డలు, ఎర్రగడ్డలు, పుట్టగొడుగులు ఆహారంగా తీసుకుంటారు. ఏటూరునాగారంలో ప్రతీ శనివారం నిర్వహించే సంతకు వచ్చి మాత్రం వారానికి సరిపడా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. అలాగే వారికి అడవిలో లభించే ఇప్ప పువ్వును బియ్యానికి విక్రయిస్తారు. ఇంతకుమించి వారికి ఇంకేం తెలియదు. అడవి దాటి బయటకి రారు. మరి వీరిని ఎందుకు వైరస్ రీచ్ కాలేకపోయిందన్న ప్రశ్నలకి నిపుణులు ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తున్నారు. వారిలో కూడా వైరస్ ప్రవేశించి ఉండవచ్చు. కానీ.., ప్రకృతితో మమేకమై.. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ.., అడవిలో దొరికే అసలైన ఆర్గానిక్ ఫుడ్ తింటున్న వీరి బాడీలో న్యాచురల్ గానే ఇమ్యూనిటీ పవర్ హై రేంజ్ లో ఉంటుంది. కాబట్టి.. వీరిలో వైరస్ లక్షణాలు బయట పడటం లేదు. వారికి అందుకే ఏమి కావడం లేదన్న అనుమానాలను వైద్య నిపుణులు వ్యక్తం చేయడం విశేషం. మరి ఈ ఆదీవాసుల లైఫ్ జీవన విధానం మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.