పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు మాణెమ్మ. షాద్ నగర్ పరిధిలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. మాణెమ్మ గ్రామ పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ సేవలు అందిస్తుంది. పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబానికి తోడు నీడగా ఉంటూ సంసారాన్ని నెట్టుకొస్తుంది. అయితే ఇటీవల మాణెమ్మ ఉదయం పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ ను నమ్మి పారిశుద్ధ్యం పనిలో భాగంగా ట్రాక్టర్ ఎక్కింది. ఇక ఆ తర్వాత అతడు చేసిన పనికి మాణెమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామం. ఇక్కడే చిర్ర మాణెమ్మ (52) అనే మహిళ కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటూ గ్రామ పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది. ఇదిలా ఉంటే మంగళవారం మాణెమ్మ, మరో సిబ్బంది కలిసి పారిశుద్ధ్య పనుల నిమిత్తం పంచాయితీ డ్రైవర్ బిక్షపతి ట్రాక్టర్ తో కలిసి వెళ్లారు. కానీ బిక్షపతి అప్పటికే అతిగా మద్యం సేవించి ట్రాక్టర్ నడుపుతున్నాడు. దీనిని పసిగట్టలేకపోయిన మాణెమ్మ అతడిని నమ్మి ట్రాక్టర్ ఎక్కింది. గ్రామంలో కొద్ది దూరం వెళ్లాక డ్రైవర్ నిర్లక్ష్యానికి అదుపుతప్పి ట్రాక్టర్ గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కిందపడిపోయారు.
మాణెమ్మకు తీవ్ర గాయాలపాలవ్వగా, మరో సిబ్బంది కాలు వీరిగింది. దీంతో వెంటనే స్పందించిన గ్రామస్తులు హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోవడంతో మాణెమ్మ అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త తెలుసుకున్న మాణెమ్మ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక ఈ ఘటన అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ బిక్షపతి పరారీలో ఉన్నాడు. మాణెమ్మ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించి.. ట్రాక్టర్ డ్రైవర్ ను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికురాలు మాణెమ్మ మృతితో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.