తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలి అనుకుంటున్నారా? కొంచెం దూరమైనా పర్లేదు, తక్కువ బడ్జెట్ లో సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం.
స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో సొంతింటి కల అనేది కలగానే మిగిలిపోతుంది. అందుకే చాలా మంది దూరమైనా గానీ శివారు ఏరియాల్లో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకోకపోయినా గానీ కనీసం పెట్టుబడి పెడితే లాభాలు పొందవచ్చునన్న ఉద్దేశంతో దూరంతో సంబంధం లేకుండా చాలా మంది ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా తక్కువ పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందాలి అనుకుంటే కనుక మీకు బెంగళూరు హైవే బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. బాలానగర్ అనే ఏరియా హైదరాబాద్ లో కూడా ఉంది కానీ మనం చెప్పుకోబోయేది మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలానగర్ గురించి.
హైదరాబాద్-బెంగళూరు హైవే మీద ఉన్న బాలానగర్ షాద్ నగర్ కి 15 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఏరియాలో తక్కువ ధరకే ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కలకు అభివృద్ధి అనేది విస్తరిస్తోంది. బెంగళూరు హైవే ఇప్పుడు పెట్టుబడులకు, పలు కంపెనీల రాకకు కేంద్ర బిందువుగా మారింది. బెంగళూరు హైవేకి కనెక్ట్ అయి ఉన్న బాలానగర్ లో స్థలం కొనుగోలు చేస్తే కనుక మంచి లాభాలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి 60 కి.మీ. దూరంలో ఉంది. గంటన్నర సమయం పడుతుంది. ఈ ఏరియాలో గజం రూ. 8500, రూ. 12 వేలు, రూ. 13 వేలు, రూ. 16 వేలు, రూ. 17 వేలు, రూ. 18 వేలు బడ్జెట్ లో ఉంది. 14 లక్షలు, 19 లక్షల 80 వేల బడ్జెట్ లో 165 చదరపు గజాల రెసిడెన్షియల్ ల్యాండ్ దొరుకుతుంది.
1485 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్ లో 3 బీహెచ్‌కే హౌజ్ కట్టుకోవచ్చు. 18 లక్షల బడ్జెట్ లో 150 గజాల (1350 చదరపు అడుగుల) స్థలం దొరుకుతుంది. 21 లక్షల 60 వేల బడ్జెట్ లో 180 గజాల (1620 చదరపు అడుగుల) స్థలం వస్తుంది. 26 లక్షల 40 వేల బడ్జెట్ లో 165 గజాల (1485 చదరపు అడుగుల) స్థలం దొరుకుతుంది. బాలానగర్ లోని ఆయా చోట్ల ఓనర్లు, పలు వెంచర్ కంపెనీలు విక్రయిస్తున్న ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏరియాలో చదరపు అడుగు రూ. 944 నుంచి 2 వేల లోపు ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడి పెడితే కనుక రెండు, మూడేళ్ళలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.