తెలంగాణలో ఓ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి భర్త భార్యను పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పిల్లలను కూడా హత్య చేయాలని భావించాడు. కానీ, పిల్లలు తెలివితో తండ్రి నుంచి తప్పించుకున్నారు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలో రాజు-సుధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే భర్త మన్నెగడ్డలో ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలు అందిస్తూ కుటుండాన్ని పోషిస్తున్నాడు. అలా వీరి సంసారం చాలా కాలం పాటు సాఫీగానే ముందుకు సాగింది. ఇదిలా ఉంటే.. శుక్రవారం రాత్రి దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన భర్త నాగరాజు.. కొబ్బరి బోండా కత్తితో భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
ఆ తర్వాత ఇంట్లో ఉన్న పిల్లలను కూడా తండ్రి గొంతు పిసికి హత్య చేయాలని చూశాడు. కానీ, పిల్లలు అతడి నుంచి తప్పించుకున్నారు. అనంతరం అతనికి ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భర్త భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.