కానీ ప్రస్తుతం కామం ముసుగులో ప్రేమ పుడుతుంది. కేవలం శారీరక సౌందర్యం చూసి.. చిన్న చిన్న గిఫ్టులు, ఓ మాట సాయంతో అమ్మాయిలను వలలో పడేస్తున్నారు అబ్బాయిలు. అదే నిజమైన లవ్ అనుకుని.. వారి కోసం పడిగాపులు కాయడం, వారికి నచ్చినట్లు నడుచుకోవడం, 24 గంటలు ప్రేమికుడు ముచ్చట్లతో మునిగి తేలిపోతుంటారు.
ప్రేమ అనేది ఓ మత్తు. అందులో కూరుకుపోతే.. ప్రపంచమే తెలియదు. అందుకే ప్రేమ గుడ్డిదీ అంటారు. కానీ ప్రస్తుతం కామం ముసుగులో ప్రేమ పుడుతుంది. కేవలం శారీరక సౌందర్యం చూసి.. చిన్న చిన్న గిఫ్టులు, ఓ మాట సాయంతో అమ్మాయిలను వలలో పడేస్తున్నారు అబ్బాయిలు. అదే నిజమైన లవ్ అనుకుని.. వారి కోసం పడిగాపులు కాయడం, వారికి నచ్చినట్లు నడుచుకోవడం, 24 గంటలు ప్రేమికుడు ముచ్చట్లతో మునిగి తేలిపోతుంటారు. చివరకు అన్ని అయ్యిపోయాక.. పెళ్లి మాట ఎత్తితే మొహం చాటేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే.. ప్రేమించేటప్పుడు రాని సాకులన్నీ వెంటనే గుర్తుకు వస్తాయి. ఇవి విన్న అమ్మాయి.. తాను మోసపోయానని గ్రహించి..చివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడదు.
ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు అపర్ణ. చూడముచ్చటగా ఉన్న ఈ యువతి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేస్తుంది. అయితే ఒకే ఒక్క కారణంతో ప్రాణాలు తీసుకుంది. అదే ప్రేమ. ఆమె పాలిట శాపమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన కేతిరెడ్డి పల్లికి చెందిన అపర్ణ.. శివ అనే యువకుడ్ని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.కానీ అంతలో దూరం పెట్టాడు. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకుంటానని హామీలను ఇచ్చి.. ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకోవడంతో మనస్థాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.