హైదరాబాద్ లో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి 3 ఏళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన రాజు-కవిత దంపతులు బతుకు దెరువు కోసం చాలా రోజుల కిందటే నగరానికి వచ్చి బతుకున్నారు. రంరెడ్డి జిల్లా హయత్ నగర్ లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల చిన్నారి కూడా ఉంది.
అయితే బుధవారం వీరు లెర్చరర్స్ కాలనీలోని ఓ భవన నిర్మాణ పనులకు వెళ్లారు. ఎండ ఎక్కువగా ఉండడంతో తల్లి తన కూతురిని పక్కనే ఉన్న ఓ అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలంలో పడుకోబెట్టింది. ఆ తర్వాత తన పనుల్లో నిమిగ్నమైంది. అయితే ఈ క్రమంలోనే అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఓ వ్యక్తి కిందకు వచ్చాడు. కారు ముందు ఓ చిన్నారి పడుకున్నది చూడకుండా తన కారును ఆ చిన్నారి మీద నుంచి పోనిచ్చాడు. దీంతో ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక కొద్దిసేపటి తర్వాత ఆ చిన్నారి తల్లి వెళ్లి చూసేసరికి కారు కింద నుజ్జు నుజ్జు అయి కూతురు శవమై కనిపించింది. ఈ సీన్ చూసిన ఆ చిన్నారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మొత్తం పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.