ఉద్యోగానికి వెళ్లామా, ఇంటికి వచ్చామా, తిన్నమా, పడుకున్నమా, తెల్లారిందా అన్నా తీరులో నేటి మనుషుల జీవితాలు సాగిపోతున్నాయి. ఏదైన శుభకార్యాలకు అలా వెళ్లి ఇలా వస్తున్నారు. ఎక్కడ ప్రశాంతమైన పలకరింపులు కనపడవు. గజిబిజి జీవితంలో సొంత వారితో కలిసి పండుగలు జరుపుకోవడం అంటే గగనమే. కొందరు చాలా సంవత్సరాలకు ఒక సారి కలవచ్చు. వారినే మనం గ్రేట్ అనుకుంటే. ఎక్కడున్న ప్రతి ఏడాది మూడు రోజుల పాటు దీపావళిని సాంప్రదాయంగా కలిసి జరుపుకుంటున్న ఓ కుటుంబాన్ని మనం ఏమనాలి. అదే సాంప్రదాయాన్ని 100 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్న ఆ కుటుంబ సభ్యులను వావ్ వీరు చాలా గ్రేట్ గురూ అనాల్సిందే కదా!
1921 నుంచి ఆనవాయితీగా..
మహబూబ్‌నగర్‌లోని సుభాషనగర్‌లో అంజమ్మ, చంద్రమౌళి అనే దంపతుల ఇల్లు కౌకుంట్ల వారసులు దీపావళి శతాబ్దాకి వేడుకుల జరుపుకుంటున్నారు. సుమారు 25 కుటుంబాలు, 150 మంది సభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు. వీరితో ఆ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. దీపావళికి మూడు రోజులపాటు అందరు కలవడం అనేది 1921 నుంచి జరుగుతుందని కుటుంబ పెద్ద చంద్రమౌళి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా నందిపేటకు చెందిన కౌకుంట్ల బాలమ్మ, వెంకయ్య దంపతులకు ఎనిమిది మంది సంతానం. ఉద్యోగరిత్యా ఎవరు ఎక్కడున్నా దీపావళికి అందరు ఒక చోట కలవాలనే సాంప్రదాయాన్నిఈ దంపతులు 1921లో ప్రారంభించారు. నేటికి వంద ఏళ్లు అయిన సందర్భంగా ఈ దీపాళిని ఘనంగా జరుపుకుంటున్నారు. పెద్దలు పిల్లలుగా మారి ఆట పాటలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ బాధలను, బాధ్యతలను మరచి ఈ మూడు రోజుల పాటు వేడుకులను ఎంజాయ్ చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. 1921 నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఇలా ఒకే చోట పండగ జరుపుకుంటున్న ఈ కౌకుంట్ల కుటుంబం నేటి తరం వారికి ఆదర్శం. ఈ కుటుంబంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.