ఇటీవల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు సైతం హార్ట్ స్ట్రోక్‌కు గురౌతున్నారు. చిన్న వయస్సుల వారి నుండి వృద్దుల వరకు దీని బారిన పడుతున్నారు. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం గుండె పోటుతో మరణించారు. ఉజ్వల భవిష్యత్తున్నయువత దీనికి బాధితులవుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని గుండె పోటుకు గురైంది.
దేశంలో ఇటీవల గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు సైతం హార్ట్ స్ట్రోక్‌కు గురౌతున్నారు. చిన్న వయస్సుల వారి నుండి వృద్దుల వరకు దీని బారిన పడుతున్నారు. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం గుండె పోటుతో మరణించారు. ఉజ్వల భవిష్యత్తున్నయువత దీనికి బాధితులవుతున్నారు. పదో తరగతి విద్యార్థి, ఇంజనీరింగ్ స్టూడెంట్, జిమ్‌కు వెళ్లిన యువ కానిస్టేబుల్, షటిల్ ఆడుతూ క్రీడాకారుడు, యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థి గుండె పోటు కారణంగానే కన్నుమూశారు. చిట్టి గుండె మెలిపెట్టి వీరి ప్రాణాలను గుంజుకుపోయింది. చేతి కొస్తున్న పిల్లలు.. అకాల మరణం చెందడంతో కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అలముకుంటున్నాయి. తాజాగా మరో విద్యార్థిని గుండె పోటుకు గురైంది.
తెలంగాణలో ఇటీవల ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. మహబూబ్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శుక్రవారం ఇంటర్ మొదటి ఏడాది పరీక్ష రాసేందుకు హాజరైంది బిందు అనే విద్యార్థిని. పరీక్ష రాస్తుండగా అస్వస్థతకు గురైంది. ఆమెకు కాస్త నలతగా అనిపించడంతో పాటు ఛాతీలో నొప్పిగా ఉండటంతో అక్కడే ఉన్న ఉపాధ్యాయులకు విషయం చెప్పగా.. వారు వెంటనే స్పందించారు. అప్రమత్తమైన అధికారులు బాలికను వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడంతో బిందుకు పెను ప్రమాదం తప్పింది. ఆమెకు వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.