ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. పట్టుమని 30 ఏళ్ళు కూడా నిండని యువత హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్నారు. కుటుంబ సభ్యులకు గుండెకోత మిగుల్చుతున్నారు.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు.. అందుకే వాన రాకడ ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరు అని అంటారు పెద్దలు. ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటు మరణాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవారు.. క్షణాల్లో కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రికి తరలించేలోగా కన్నుమూస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో వరుస మరణాలు సంభవించాయి. చిన్న వయసు వారికి కూడా గుండెపోటు రావడం గమనార్హం. జిమ్ కి వెళ్లి వచ్చిన యువకుడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి కన్నుమూశాడు.. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
మహబూబ్‌నగర్ జిల్లా పట్టణానికి చెందిన మాజిద్ హుస్సేన్ షోయబ్ అనే యువకుడు నగర మున్సిపాలిటీలో కాంటాక్ట్ జాబ్ చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజూ జిమ్ కి వెళ్తూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు షోయబ్. తన స్నేహితులతో ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు అని హిల్త్ టిప్స్ కూడా చెప్పేవాడు. రోజూ లాగే గురువారం రాత్రి జిమ్ కి వెళ్లి వ్యాయం చేసి ఇంటికి వచ్చాడు మాజిద్. రాత్రి 11 గంటల ప్రాంతంలో తనకు విపరీతంగా ఛాతి నొప్పి వస్తుందని గిల గిలా కొట్టుకున్నాడు. వాంతులు కూడా చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీద్ ని పరీక్ష చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు.
ఎప్పుడు తన ఆరోగ్యమే కాదు.. తన కుటుంబం, స్నేహితుల ఆరోగ్యం గురించి ఆలోచించే మాజిద్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ.. జిమ్ నుంచి వచ్చిన మాజిద్ హుస్సేన్ షోయబ్ కు గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తరలించారు.. అప్పటికే అతను కన్నుమూశాడు.. దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని అన్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పట్టుమని 30 ఏళ్లు కూడా నిండని ఎంతో మంది యువత గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. ఒకప్పుడు కరోనా పేరు చెబితే భయపడేవారు.. ఇప్పుడు గుండెపోటు అంటే భయంతో వణికిపోతున్నారు.