మద్యం మత్తులో ఉన్న ఓ ఎస్ఐ తెల్లవారుజామున ఊహించని షాక్ ఇచ్చాడు. తాగిన మైకంలో ఇదే తన ఇల్లే అనుకుని పక్కింట్లోకి వెళ్లాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ ఇంటి తలుపు కూడా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఇతను ఖచ్చితంగా దొంగతనానికే వచ్చాడని అందరూ ఆ ఎస్ఐ తగిన బుద్ది చెప్పారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఘటనలో ఎస్ఐ పొరపాటును పక్కింట్లోకి వెళ్లాడా? లేక కావాలని వెళ్లాడా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది మహబూబ్ నగర్ జడ్చర్ల పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ.
ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు అనే వ్యక్తి రాజంపూర్ మండలం ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి శ్రీనివాసులు ఫుల్ గా మద్యం సేవించారు. అదే రాత్రి తెల్లవారుజామును డ్రైవర్ కారులో అతని ఇంటి సమీపంలో దించేసి అతను వెళ్లిపోయాడు. ఇక మద్యం మత్తులో ఉన్న ఆ ఎస్ఐ ఓ ఇంటి ముందు టెంట్ వేయడంతో తనకు ఏ నాది అని అర్థం కాలేదు. దీంతో తన ఇల్లు ఇదే అనుకుని ఎస్ఐ శ్రీనివాసులు పక్కంటికి వెళ్లాడు. వెళ్లడమే కాకుండా ఆ ఇంటి తలుపు కొట్టి గోడ దూకే ప్రయత్నం కూడా ,చేశారని స్థానికులు చెబుతున్నారు.
ఇక ఇతని శబ్దానికి ఆ ఇంటి వారితో పాటు పక్కింటి వ్యక్తులు అందరూ నిద్రలేచారు. దీంతో అందరూ బయటకు వచ్చి చూడగా ఆ వ్యక్తి ఫుల్ కిక్ లో ఉన్నాడు. ఇతను నిజంగానే దొంగతానికి వచ్చాడని స్థానికులు అంతా ఆ ఎస్ఐని ఓ చెట్టుకు కట్టేశారు. ఇంతటితో ఆగకుండా అతనిపై దాడికి కూడా పాల్పడ్డారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచాారాన్ని అందించారు. ఎస్ఐ ఘటనపై సీరియస్ అయిన పై అధికారులు శ్రీనివాసులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఇదే ఘటన స్థానికింగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.