ఇటీవల ఆకాశంలో బెలూన్లు కలకలం సృష్టిస్తున్నాయి. అకస్మాత్తుగా పంటపొలాల్లో బెలూన్ యంత్రాలు పడిపోవడంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. వాటి గురించి తెలిసిన తర్వాత ఊపిరిపీల్చుకుంటున్నారు.
ఇటీవల ఆకాశంలో బెలూన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మద్య ఆకాశంలో భారీ బెలూన్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్ చల్ చేసింది.. అది గ్రహాంతరవాసులను తీసుకు వెళ్తున్న అంతరిక్ష నౌక అని.. విదేశీ గూఢాచర్యానికి సంబంధించిన బెలూన్లు అని కొంత మంది.. ఇలా రక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అది వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఎన్‌బిఎఫ్ పరిశోధనలో భాగంగా బెలూన్ విడుదల చేసినట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వ్యవసాయ పంట పొలాల్లో ఓ భారీ బెలూన్ దానికి అమర్చిన పరికరాలు స్థానికంగా కలకలం రేపాయి. ఆ బెలూన్ చూసి జనాలు భయంతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే..
నాగర్‌కర్నూలు జిల్లా తర్నికల్ గ్రామ శివారులో ఆదివారం ఆకాశం నుంచి ఓ భారీ బెలూన్ కి సంబంధించిన యంత్రం స్థానిక పంటపొలాల్లో పడిపోయింది. అది చూసిన గ్రామస్థులు భయంతో ఏదో ఉపద్రవం ముంచుకు వస్తుందని పరుగులు తీశారు. స్థానికులు కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బెలూన్ యంత్రాన్ని పరిశీలించారు. అయితే అది వాతావరణ పరిస్థితలుపై అధ్యయనం చేసేందుకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు పంపించి బెలూన్ అని గుర్తించారు. హైదరాబాద్ శివారులోని పరిశోధనా కేంద్రం నుంచి శనివారం రాత్రం ఈ బెలూన్ ని ఆకాశంలోకి వదిలామని.. 32 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత నిర్శేశించుకున్న లక్ష్యం పూర్తి కావంతో శాటిలైట్ సాయంతో ఒక ఖాళీ ప్రదేశం ఎంచుకొని కిందకు దింపామని పరిశోధకులు తెలిపారు.
సుమారు 1050 కిలోల బరువు ఉన్న యంత్రపరికరాలకు ఎలాంటి నష్టం జరగకుండా సురక్షితంగా కిందకు దింపామన్నారు. ఆ బెలూన్ యంత్రం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉర్కొండ శివారులో బండారు బాలయ్యకు చెందిన మామిడితోటలో పడిపోయిందని అధికారులు తెలిపారు. అయితే ఆకాశం నుంచి భారీ బెలూన్ యంత్రం తమ తోటలో పడిపోవడంతో ఒక్కసారిగా జనాలు భయపడిపోయారని గ్రాస్థులు తెలిపారు. వాతావరణంలో జరిగే మార్పులు.. కాలుష్యం, ఓజోన్ పొర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు దీన్ని