ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ భారత్ లో 15 రోజుల క్రితమే అడుగుపెట్టింది. అందులో కొన్ని ఫీచర్లు అందరికీ తెగ నచ్చేశాయి. వాటిలో ముఖ్యమైనది క్రాష్ డిటెక్షన్ ఫీచర్. అంటే మనం కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే.. దీన్ని గుర్తించిన ఐఫోన్ వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించడం. మరి, ఈ ఫీచర్ పని చేస్తుందా? లేదా? అన్నది ఎలా తెలియాలి. ఏదైనా జరిగితేనేగా తెలిసేది. ఇలాంటి అనుమానమే ఓ యూట్యూబర్ కొచ్చింది. దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఆ యూట్యూబర్ ఏం చేశాడో తెలుసా? కారు యాక్సిడెంట్ ప్లాన్ చేశాడు.
ఐఫోన్ 14లో వచ్చిన క్రాష్ డిటెక్షన్ ఫీచర్ పై అనుమానమొచ్చిన ఓ యూట్యూబర్, 2005 మోడల్ మెర్క్యూరీ గ్రాండ్ మార్కయిస్ కారులో ఐఫోన్‌ను పెట్టి యాక్సిడెంట్ చేశాడు. రిమోట్ కంట్రోల్‌తో కారుకు యాక్సిడెంట్ చేసి, ఈ తతంగాన్నంతా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్లో పోస్టు చేశాడు. మొత్తం రెండుసార్లు ఇలా యాక్సిడెంట్ చేయగా.. రెండు సార్లూ ఐఫోన్ ఫీచర్ పనిచేసిందని, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంకు కాల్ చేసిందని తేల్చాడు.కాకుంటే.. కొంచెం లేట్ అయిందని తెలిపాడు.
క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఏంటంటే.. యాక్సిడెంట్ అవగానే పది సెకన్లపాటు ఐఫోన్లో టైమర్ వస్తుంది. ఈ టైమర్‌ను ఆపేస్తే యూజర్‌కు పెద్దగా ప్రమాదం లేనట్లు ఐఫోన్ భావిస్తుంది. ఒకవేళ యూజర్ తన మొబైల్లో టైమర్ ఆపకపోతే.. వెంటనే అత్యవసర విభాగానికి, అతని మొబైల్లోని కాంటాక్టులకు మెసేజులు పంపుతుంది. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.