టెక్నాలజీ వినియోగం పెరుగుతోన్న కొద్దీ సైబర్ నేరాలకు అంతులేకుండా పోతోంది. ప్రధానంగా సోషల్ మీడియాను సాధనంగా వాడుకుంటూ సైబర్ మాయగాళ్లు అమాయకులను మోసం చేస్తోన్న ఉదంతాలు ఇటీవల భారీగా పెరిగాయి. సైబర్ నేరాలను నివారించడానికి టెక్ సంస్థలు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందులోని లోపాలను ఆసరగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అలాంటి లోపాలను గుర్తించేందుకు తగిన పారితోషకాలు అందిస్తుంటాయి ఆయా సంస్థలు. ఇలాంటి సందర్భాల్లో ఎథికల్ హకర్స్ తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతుంటారు. అలా ప్రఖ్యాత ఇన్‌స్టాగ్రామ్ లో అత్యంత ప్రమాదరక బగ్ ను కనిపెట్టి భారీ మొత్తంలో పారితోషికాన్ని కొట్టేశాడో యువకుడు.
ఇంటర్నెట్ వినియోగం పెరిగాక సోషల్ మీడియా యాప్‌లలోనే సమయాన్నంతా గడిపేస్తున్నాం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ట్విట్టర్.. అంటూ బిజీ బిజీగా కాలం గడిచిపోతోంది. మన సమాచారం ఏమైనా లీక్ అవుతుందా? మనమేమైనాప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందా? అన్న విషయాలు పక్కనపెట్టి వీటిలోనే గడుపుతున్నాం. ఆయా కంపెనీలు ప్రైవసీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అప్పుడప్పుడు కొన్ని లోపాలు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా.. అలాంటి లోపాన్ని ఇన్‌స్టాగ్రామ్, పేస్ బుక్ లలో వెతికి పట్టుకున్నాడు.. నీరజ్ శర్మ. దీంతో సదరు కంపెనీకి వివరాలను అందించడంతో… సంబంధింత బగ్‌ను నిర్ధారించుకుని సుమారు రూ.38 లక్షలను అతనికి బహుమతిగా అందించింది.
Instagram Rewards Jaipur Student Neeraj Sharma With Rs 38 Lakh for Finding a Bug, Saving Users From Getting Hacked@DrJitendraSingh#instagram #Jaipur #Rajasthan #technologynews https://t.co/oVCLkclqo5
— LatestLY (@latestly) September 19, 2022
నీరజ్ శర్మ కనిపెట్టిన బగ్ ఏంటీ?
సాధారణంగా ఏ సోషల్ మీడియా యాప్ లో అయినా.. మన థంబ్‌నెయిల్ మార్చాలంటే లాగిన్ అవ్వడం కంపల్సరీ. మనకు తెలిసినంతవరకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లేకుండా అది సాధ్యపడదు. కానీ, అది సాధ్యపడుతుంది అని నిరూపించాడు నీరజ్ శర్మ. లాగిన్ అవ్వకుండానే.. ఎవరి ఖాతాలోనైనా థంబ్ నెయిల్ మార్చవచ్చని వారికి డెమో రూపంలో చేసి చూపించాడట. ఈ బగ్ కారణంగా ఇతరుల ఖాతాల్లోని రీల్స్ వీడియోలకున్న థంబ్ నెయిల్ ని మార్చేయవచ్చట.
ఈ బగ్‌ను ఏడాది జనవరి 31న నీరజ్ కనుగొన్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్, పేస్ బుక్ లకు నివేదిక పంపాడు. సదరు కంపెనీ వారు.. అది నమ్మకుండా అతన్ని డెమో చేసిచూపించాల్సిందిగా కోరడం, అది నీరజ్ చేసి చూపించడం.. ఇలా నాలుగు గడిచిపోయాయి. చివరకి అతని కనిపెట్టింది నిజమే అని నిర్ధారించాక.. మే 11న అతనికి బహుమతి ప్రకటిస్తున్నట్లు మెయిల్ పంపారు. రూ. 35 లక్షల బహుమతినితో పాటు, రివార్డ్ ఇవ్వడంలో నాలుగు నెలల ఆలస్యానికి బదులుగా మరో రూ. 3 లక్షల బోనస్‌గా ఇచ్చింది. కొన్ని కోట్ల మంది యూజర్ల సమాచారాన్ని హ్యాకర్ల చేతికి చిక్కకుండా కాపాడిన ఈ యువకుడిపై, మీ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో తెలియజేయండి.