Telegram: కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు కొంతమంది దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని రెడీగా ఉంటారు. అయితే, సినిమా హాల్లో కాదు.. ఏదైనా పైరేట్ సినిమా వెబ్‌సైట్లలో చూడ్డానికి. ప్రస్తుత కాలంలో దొంగ సినిమాలు చూడటానికి ఎక్కువ మంది నెటిజన్లు టెలీగ్రామ్‌ను వాడుతున్నారు. అందులో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే వారి పాలిట సమస్యగా మారనుందని సమాచారం. దొంగతనంగా సినిమాలు విడుదల చేయ్యటమే కాదు.. చూడటం కూడా నేరమే. అది కాపీ రైట్ వాయిలేషన్ కిందికి వస్తుంది. ఇక, కాపీరైట్ వాయిలేషన్‌ను ఢిల్లీ కోర్టు సీరియస్‌గా తీసుకుంది. కాపీ రైట్ వాయిలేషన్స్‌కు పాల్పడుతున్న వారి వివరాలు ఇవ్వాల్సిందిగా బుధవారం కోర్టు టెలిగ్రామ్ యాప్‌ను ఆదేశించింది.
ముఖ్యంగా కొత్త సినిమాలను టెలిగ్రామ్ యూజర్లకు అందిస్తున్న వారికి సంబంధించిన వివరాలను అడిగింది. అయితే, ఇందుకు టెలిగ్రామ్ ఒప్పుకోలేదు. యూజర్ల సమాచారాన్ని ఇవ్వటం అంటే.. వారి ప్రైవసీకి భంగం కలిగించినట్లేనని కోర్టుకు తెలిపింది. కోర్టు టెలిగ్రామ్ వాదనలను కొట్టిపారేసింది. ఓ సీల్డ్ కవర్‌లో వ్యక్తుల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కాపీరైట్ వాయిలేషన్స్‌కు పాల్పడుతున్న ఛానల్స్, మొబైల్ డివైజెస్, మొబైల్ నెంబర్స్, ఐపీ అడ్రస్‌లు, ఈమేయిల్ అడ్రస్‌లు ఇవ్వాలని కోరింది. విచారణ జరిపి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ఈ కేసు ఓ స్టడీ మెటీరియల్ గొడవతో తెరపైకి వచ్చింది. కేడీ క్యాంపస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కోచింగ్ సంస్థ తాము తయారు చేసిన స్టడీ మెటీరియల్ కాపీ అయి టెలిగ్రామ్‌లోకి వచ్చిందని కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆ స్టడీ మెటీరియల్‌ను అప్‌లోడ్ చేసిన వారిపై, డౌన్‌లోడ్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక్కడ టెలిగ్రామ్‌లో సినిమాలు చూసే వాళ్లు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఈ రోజు స్టడీ మెటీరియల్ విషయంలో కోర్టు తీసుకున్న నిర్ణయమే.. సినిమాల విషయంలోనూ వర్తించే అవకాశం ఉంది. మరి, టెలిగ్రామ్‌లో కాపీ రైట్స్ వాయిలేషన్స్‌కు సంబంధించిన కోర్టు తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : సెప్టెంబర్‌లోనూ మొబైల్స్ ధమాకా.. ఐఫోన్ 14 నుంచి బడ్జెట్ ఫోన్స్ దాకా..!