యూట్యూబ్.. ప్రస్తుతం చాలా మందికి ఇది వినోదం పంచడమే కాకుండా.. ఉపాధిని కూడా కల్పిస్తోంది. దీనిపై ఆదారపడి ఎంతోమంది కంటెంట్ క్రియేటర్స్ లబ్ధి పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూట్యూబ్ కు కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు.
వీడియో యాప్స్ లో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ కేవలం వీక్షకులే మాత్రమే కాకుండా.. కంటెంట్ క్రియేటర్లు కూడా ఉంటారు. వరల్డ్ మొత్తంలో కోట్ల సంఖ్యలో కంటెంట్ క్రియేటర్లు, వీక్షకులు ఉన్నారు. సాధారణంగా కంటెంట్ క్రియేటర్లకు వీక్షకుల కంటే ప్రత్యేకంగా అదనపు ప్రయోజనాలను కల్పిస్తూ ఉండే విషయం తెలిసిందే. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే వారికోసం సెపరేట్ గా ఒక ఫీచర్ తీసుకొచ్చింది. ఆ ఫీచర్ ఏంటి? ఆ ఫీచర్ వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏంటో చూద్దాం.
యూట్యూబ్ అంటే కేవలం వీక్షకులు, సబ్ స్క్రైబర్లే కాదు.. కంటెంట్ క్రియేటర్లు కూడా. యూట్యూబ్ లో వచ్చే కంటెంట్ ఇచ్చేది కంటెంట్ క్రియేటర్లే. యూట్యూబ్ స్వతహాగా క్రియేట్ చేసే కంటెంట్ చాలా తక్కువ. అందుకే యూట్యూబ్ తమ కంటెంట్ క్రియేటర్లకు ఎప్పుడూ ప్రత్యేకంగా చూస్తుంది. ఇప్పుడు వారికోసం ఒక కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదేంటంటే.. మల్టీలాంగ్వేజ్ ఫీచర్ ని తీసుకొచ్చింది. దీనివల్ల వారికి నచ్చిన వీడియో వారికి నచ్చిన భాషలో చూసేందుకు వీలు కలుగుతుంది. నిజానికి కంటెంట్ క్రియేటర్లు వారికి నచ్చిన వీడియోస్ చూసి ఇన్ స్పైర్ అయ్యి కూడా వీడియోలు చేస్తుంటారు. అయితే అందుకు భాష ఒక అడ్డంకి కావచ్చు.
ఇప్పుడు ఈ ఫీచర్ తో ఆ అడ్డంకి తొలగిపోతుందని చెబుతున్నారు. ఇక నుంచి కంటెంట్ క్రియేటర్లు తమకు నచ్చిన కంటెంట్ ని చూసి అర్థం చేసుకుని దానిని వారు కూడా వీడియో చేసే వీలు ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ని మాత్రం ప్రస్తుతానకి ఎక్స్ క్లూజివ్ గా కంటెంట్ క్రియేటర్ల కోసం అందిస్తున్నారు. ఈ ఫీచర్ ను వాడుకునేందుకు సెట్టింగ్స్ లో ఉండే ఆడియో ట్రాక్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో మీకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకుని వీడియో చూడచ్చు. ఈ ఆప్షన్ సెలక్టివ్ కంటెంట్ క్రియేటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది వాళ్లు టీవీ, మెబైల్, పీసీ ఇలా దేనిలో అయినా చూడచ్చు. కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ తీసుకొచ్చిన మల్టీ లాంగ్వేజ్ ఫీచర్ ఉపయోగమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.