ప్రస్తుత స్మార్ట్ యుగంలో రోజుకో కొత్త టెక్నాలజీ వెలుగులోకి వస్తోంది. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ లేని వ్యక్తి లేడు అంటే అతిశయోక్తికాదు. ఇక సెల్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ఉండనే ఉంటుంది. ఈ యాప్ ద్వారా గతంలో మెసేజ్ లు ఫోటోలు మాత్రమే పంపుకునే వారు. కానీ కాలక్రమంలో మారుతున్న టెక్నాలజీలో భాగంగా.. వాయిస్ మెసేజ్ ,వీడియో కాల్స్, డబ్బులు కూడా పంపించుకోవచ్చు. ఇలా ఒక్కటేంటి.. ఎన్నో అంశాలు సులువుగా షేర్ చేసుకోవచ్చు. ఇక వాట్సాప్ యాప్ సైతం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను పలకరిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే కొన్ని ఫోన్స్ లల్లో వాట్సాప్ పనిచేయదని గతంలోనే తేల్చి చెప్పిన సంస్థ.. తాజాగా వాట్సాప్ పని చేయని మోడల్స్ లో మరికొన్ని మెుబైల్స్ ను చేర్చారు. ఫిబ్రవరి 1 నుంచి కొన్ని మోడల్స్ మెుబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు అని మెటా ప్రకటించింది.
ఉదయం లేవగానే మన కుటుంబ సభ్యుల ఫేస్ చూస్తామో లేదో గానీ.. కచ్చితంగా మాత్రం సెల్ ఫోన్ లోని వాట్సాప్ ను మాత్రం చూస్తాం. అంతలా మనిషి దిన చర్యలో భాగం అయిపోయింది వాట్సాప్. మరి అలాంటి వాట్సాప్ కొన్ని మోడల్స్ మెుబైల్స్ లో పనిచేయదు అని ప్రకటించింది మెటా. మరి వాట్సాప్ పనిచేయని ఫోన్లలో మీ ఫోన్ ఉందో ఇప్పుడే చెక్ చేసుకోండి. మెటా తెలిపిన వివరాల ప్రకారం.. ఆండ్రాయిడ్ 4.1, iOS12 లేదా ఐఫోన్లు వెర్షన్ KaiOS 2.5.0తో పని చేసే మోడల్ లు, 8-10 సంవత్సరాలు గడిచిన పాత మోడల్ లు, ఈ మెసేజింగ్ యెుక్క కొత్త వెర్షన్ ను ఆపరేట్ చేయగల మోడల్ లలో వాట్సాప్ ఇక నుంచి పని చేయదని మెటా తెలిపింది.