ప్రపంచవ్యాప్తంగా సోషల్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్‌కు మంచి ఆదరణ ఉంది. ఒక్క భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తమ యూజర్లకు మంచి ఫీచర్లను అందించేందుకు ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే అదిరిపోయే ఫీచర్లు త్వరలోనే మీకు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి వచ్చే అప్‌డేట్‌తో మీకు మీరే వాట్సాప్‌లో మెసేజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లను వాట్సాప్ త్వరలోనే అప్‌డేట్ రూపంలో తీసుకురానుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వార్త మాత్రం అప్ డేట్ గురించి కాదులెండి.
ఎప్పుడూ అప్‌డేట్లతో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే వాట్సాప్.. ఈసారి ఓ ఫీచర్‌ను తొలగించి షాకిచ్చింది. అవును వాట్సాప్ తాజాగా ఒక ఫీచర్‌ను తొలగిచింది. యూజర్ల గోప్యతను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ వ్యూ వన్స్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా మీరు ఫొటో లేదా వీడియో వ్యూ వన్స్ అని సెండ్ చేయచ్చు. అలా చేస్తే అవతలి వాళ్లు ఆ ఫొటో లేదా వీడియో చూసిన తర్వాత అది డిలీట్ అయిపోతుంది. అది మొబైల్‌లో కూడా సేవ్ కాదు. అలాగే దానిని మీరు స్క్రీన్ షాట్ కూడా తీయలేరు. అయితే వెబ్ వాట్సాప్ లేదా డెస్క్ టాప్‌లో వ్యూ వన్స్ లో వచ్చి ఇమేజెస్‌ని స్క్రీన్ క్యాప్చర్, ప్రింట్ స్క్రీన్ వంటి ఫీచర్ల సాయంతో సేవ్ చేసుకుంటున్నట్లు వాట్సాప్ గుర్తించింది.
ఏదైతే గోప్యత కోసమని తీసుకొచ్చిన ఫీచరే వ్యూ వన్స్ అనేది. కానీ, ఆ ఫీచర్‌ను తెచ్చిన ఉద్దేశం అక్కడ పూర్తి కావడం లేదు. అందుకే వాట్సాప్ ఆ ఫీచర్‌ను పూర్తిగా వెబ్ వర్షన్, డెస్క్ టాప్ వర్షన్ల నుంచి తొలగించింది. అంటే మీరు కేవలం మొబైల్ నుంచి మాత్రమే వ్యూ వన్స్ అని ఇమేజ్ లేదా వీడియో పంపగలరు. దానిని డెస్క్ టాప్ లేదా వెబ్ వర్షన్ ద్వారా సెండ్ చేయడం కుదరదు. ప్రస్తుతం అయితే వ్యూ వన్స్ ఆప్షన్ మొబైల్ లో అయితే వర్క్ చేస్తోంది. కానీ, వెబ్ వర్షన్ వాట్సాప్‌లో కనిపించడం లేదు. ముందు ముందు వాట్సాప్ ఇంకా ఎన్ని ఫీచర్లు కొత్తవి తీసుకొస్తుందో.. లేదా ఉన్నవి తొలగిస్తుందో చూడాల్సి ఉంది.
WhatsApp disables the “view once” feature for web & desktop apps.
The reason behind this could be privacy concerns while using WhatsApp on a desktop at work. “View once” messages are generally private & viewing them on a large screen may compromise their confidentiality.
— 🟣 Stemble (@Stemble_) November 6, 2022