వాట్సాప్ అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సోషల్ మెసేజింగ్ యాప్. ఈ సంస్థ తమ యూజర్లను అలరించేందుకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తీసుకొస్తుంటుంది. ప్రతినెల ఆండ్రాయిడ్- ఓవోఎస్ యూజర్ల కోసం అప్ డేట్స్ ని రిలీజ్ చేస్తుంటుంది. వాట్సాప్ తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ ని తీసుకొచ్చింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా యాప్సే వాడుతున్నారు. వీటిని వాడటం అంటే ఇవి లేకపోతే పూటగడవని పరిస్థితి అనమాట. ముఖ్యంగా ఇంక సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఫోన్లు, రీల్స్ అంటూ ఫుల్ హడావుడిగా ఉంటారి. యూజర్ల ఇంతలా సోషల్ మీడియాలో యాప్స్ వాడుతున్నారు కాబట్టే.. వాట్సాప్ లాంటి సంస్థలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్స్ తీసుకొస్తూ అలరిస్తోంది. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ గురించి తెలుసుకున్నాక చాలా మంది యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మొత్తం మెటా సంస్థకు చెందిన యాప్స్ అని అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఈ మూడు యాప్స్ మెటా కిందకు వచ్చాయో అప్పటి నుంచి అన్ని యాప్స్ అనుసంధానం చాలా సులభమైపోయింది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ నుంచి పోస్టులు, కంటెంట్ ని ఫేస్ బుక్ లో కూడా షేర్ చేయచ్చు. అలాగే ఇప్పుడు ఆ ఫీచర్ ని వాట్సాప్ కి కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంటే మీరు వాట్సాప్ లో స్టేటస్ పెట్టారనుకోండి. దానిని తర్వాత ఫేస్ బుక్ లో విడిగా పెట్టుకోవాల్సి వస్తుందనమాట. కానీ ఇప్పుడు మీరు ఒకే స్టేటస్ ఒకేసారి వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేయచ్చు.
స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్ లో ఇప్పటివరకు మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్స్ పెక్ట్, ఓన్లీ షేర్ విత్ అని ఆప్షన్స్ ఎలా అయితే ఉన్నాయో.. అలాగే త్వరలో ఫేస్ బుక్ అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత మీరు ఫేస్ బుక్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకుని వాట్సాప్ లో స్టేటస్ పెడితే మీ ఫేస్ బుక్ ఖాతాలో కూడా పోస్ట్ అవుతుంది. ఇందుకోసం మీరు మీ ఫేస్ బుక్ ఖాతాని వాట్సాప్ అకౌంట్ కి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వాట్సాప్ నుంచి ఎన్నో ఫీచర్స్ వచ్చాయి. ఇటీల అసలు వాట్సాప్ యూజర్ ఇంటర్ ఫేస్ మొత్తం మారిపోతోందని వార్తలు వచ్చాయి. ఆండ్రాయిడ్ కూడా ఐవోఎస్ తరహాలో ఇంటర్ ఫేస్ మారిపోతుందంటూ టెక్ నిపుణులు కామెంట్ చేశారు. అయితే దానిపై వాట్సాప్ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. తాజాగా ఈ వాట్సాప్ స్టేటస్ ని ఫేస్ బుక్ లో షేర్ చేయచ్చు అనే వార్త మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.