ప్రపంచంలో నిత్యం కోట్లాది మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ యాప్ లో చాట్ సదుపాయమే కాకుండా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్ కూడా చేసుకునే సదుపాయం ఉండడంతో యూజర్లు బాగా అట్ట్రాక్ట్ అయ్యారు. అందుకే వాట్సాప్ కూడా యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో మరో అదిరిపోయే ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.
ఇటీవల వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ అకౌంట్ ఉన్న ప్రైమరీ మొబైల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా.. అంతకుముందే వాట్సాప్ వెబ్ ద్వారా కనెక్ట్ అయిన కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వర్క్ అవుతూనే ఉంటుంది. అంటే.. మెసేజ్‌లు సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా ఒకేసారి ఓ ఫోన్, నాలుగు డివైజ్‌ల్లో వాట్సాప్ అకౌంట్ వాడుకోవచ్చు. అయితే తాజాగా ఒకే ఫోన్ నెంబర్ తో రెండు వేరు వేరు మొబైల్స్ లో వాట్సాప్ ఉపయోగించే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అంటే.. తమ ప్రైమరీ మొబైల్లో ఉన్న వాట్సాప్ అకౌంట్‌ను ఇంకో ఫోన్లో కూడా వాడుకునే ఫీచర్ అన్నమాట.
ఈ ఫీచర్.. వాట్సాప్ బీటా 2.22.15.13 అప్డేట్లో కనిపించిందని వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. ఇందుకోసం.. వాట్సాప్ అకౌంట్ ఉన్న ప్రైమరీ మొబైల్ నుంచి లింక్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉందని, త్వరలోనే అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఈ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Jio: జియో కస్టమర్లకు సూపర్ ఛాన్స్.. రూ.20కే 28GB ఎక్స్ట్రా డేటా..!
ఇదీ చదవండి: Prefab Homes: మీ సొంత స్థలంలో 20 లక్షలకే అదిరిపోయే డూప్లెక్స్ హౌస్!