ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తూ వాట్సాప్ మరింత ఆకర్షణీయంగా మారుతోంది. తాజాగా పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తరహాలో ఎమోజీ రియాక్షన్స్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానునున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ధృవీకరించారు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మెసేజ్ లకు ఎమోజీలతో రిప్లే ఇవ్వొచ్చు. అయితే, ఈ ఫీచర్ మొదట వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇతర వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని వాబీటాఇన్ఫో పేర్కొంది. వాబీటాఇన్ఫో ప్రకారం.. ప్రస్తుతం లైక్, లవ్, లాఫ్, ఆశ్చర్యం, విచారం, ధన్యవాదాలు అనే ఆరు ఎమోజీ రియాక్షన్ పీచర్లు అందుబాటులో ఉన్నాయి. యూజర్ల కోరిక మేరకు ఈ రియాక్షన్స్ కు అదనంగా మరిన్ని ఎమోజీలను జోడిస్తామని వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: WhatsApp: ఫోన్ పే, గూగుల్ పే లకు గట్టి పోటీ.. వాట్సాప్ లో క్యాష్‌బ్యాక్ ఆఫర్!
మీరు ఏదేని వాట్సాప్ యూజర్ నుంచి వచ్చిన మెసేజ్‌కు రియాక్షన్ తెలుపాలనుకుంటే ముందుగా వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. అటుపై మీకు వచ్చిన మెసేజీల్లో రియాక్ట్ కావాలనుకున్న మెసేజ్‌పై ప్రెస్ చేసి హోల్డ్‌లో ఉంచాలి. తర్వాత ఆరు రియాక్షన్ ఏమోజీల్లో మీకు వచ్చిన మెసేజ్‌కు అనుగుణంగా ఉన్న ఎమోజీని ఎంపిక చేసుకుని పాప్అప్ మెనూలో చేర్చాలి.
1. WhatsApp has begun rolling out a feature that allows users to react to messages with emojis.
The feature currently includes six emoji reactions, but will add more in the future.
Users will now also be able to share files up to 2GB in size, up from the previous 100MB limit. https://t.co/3bj1kSiRft pic.twitter.com/JeZKmpzzJ3
— BFM News (@NewsBFM) May 6, 2022