అందరి సోషల్ లైఫ్ లో సోషల్ మీడియా ఒక భాగం అయిపోయిన విషయం తెలిసిందే. అలాగే మెసేజింగ్ యాప్స్ ని కూడా బాగా వాడుతున్నారు. వాటి ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫిస్ కు సంబంధించి మెసేజెస్ చేస్తుంటారు. అయితే మనం చేసే మెసేజెస్ ఎంతవరకు సెక్యూర్డ్ అంటే మాత్రం సమాధానం చెప్పలేరు.
ఇప్పుడు ప్రపంచం అంతా ఇంటర్నెట్ మీదనే నడుస్తోంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ఏదో రకంగా ఇంటర్నెట్ మనల్ని ఇన్ ఫ్లుఎన్స్ చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా మనం కూడా ప్రతి విషయంలో ఇంటర్నెట్ మీదే ఆధారపడుతున్నాం. సేవల కోసం మాత్రమే కాదు.. కమ్యూనికేషన్ కూడా అంతర్జాలం ద్వారానే జరుగుతోంది. అందుకోసం ఇంటర్నెట్ ద్వారా పనిచేసే ఎన్నో మేసేజింగ్ యాప్స్ ని వాడుతున్నాం. వాడుతున్నాం సరే కానీ, వాటివల్ల మన మెసేజెస్ సేఫ్ అనే నమ్మకం మాత్రం ఉండటం లేదు. ఏ యాప్ మన మెసేజెస్ ని చూస్తోందో? ఏఏ యాప్స్ మన వ్యక్తిగత సమాచారాన్ని తమ అవసరాలకు వాడుకుంటున్నాయో చెప్పలేం. అయితే ఉన్న వాటిలో టాప్ 10 మెసేజింగ్ యాప్స్ ఏవో చూద్దాం.
మనం ఎన్నో యాప్స్ వాడుతూ ఉంటాం. వాటిలో ఏది సెక్యూర్డ్ అంటే మనం కచ్చితంగా చెప్పలేం. మరీ ముఖ్యంగా మెసేజింగ్ యాప్స్ కచ్చితంగా సెక్యూర్డ్ గా ఉండాలి. ఎందుకంటే అందులో మన మాటలు మాత్రమే కాదు.. మన వ్యక్తిగత- సున్నితమైన సమాచారం ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమాచారాన్ని సదరు యాప్స్ మన సమచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సమాచారం ద్వారా వారి బిజినెస్ యాడ్స్ ప్లే చేయడం జరుగుతుంది. మన సమాచారాన్ని బేస్ చేసుకునే మనకు బిజినెస్ కాల్స్ కూడా వస్తుంటాయి. అయితే వాళ్లు మన మెసేజెస్ మొత్తం చదువుతున్నారు అంటే మన వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసినట్లే.
అంతేకాకుండా కొన్ని రంగాలు, సేవలకు సంబంధించిన వారి సమాచారం బయటకు వెళ్లడం అంత మంచింది కాదు. ఉదాహరణకు వైద్య రంగంలో ఉండేవారి చాట్స్ పరిశీలిస్తే వారికి ఎంతో మంది పేషెంట్స్ వివరాలు, వారి సమస్యలు తెలిసే అవకాశం ఉంటుంది. అది వారి ప్రైవసీని దెబ్బతీసేందుకు ఆస్కారం అవుతుంది. ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన వారి సమాచారం తీసుకోవడం వల్ల ఎంతోమందికి సంబంధించిన ఆరోగ్య, కుటుంబ సమాచారం తెలిసిపోతుంది. 2019లో వెలుగు చూసిన ఒక విషయం అందరిని భయభ్రాంతులకు గురి చేసేంది. ప్రతిరోజు NSA 200 మిలియన్ల మెసేజులను కలెక్ట్ చేస్తుందని తెలుసుకుని మన గోప్యత ఏ స్థాయిలో ఉందో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అప్పటి నుంచి మనం వాడే మెసెంజర్ ఎంత సెక్యూర్ అనే ప్రశ్న వేసుకోవడం ప్రారంభించారు.
అసలు ఏఏ అంశాలను బట్టి ఒక మెసేజింగ్ యాప్ ని సెక్యూర్డ్ అంటారంటే.. ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్, ప్రభుత్వానికి తలొగ్గకపోవడం, మెటా డేటా ఎన్ క్రిప్షన్ వంటి ఫీచర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్న మెసేజింగ్ యాప్స్ సెక్యూర్డ్ అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ లెక్కల ప్రకారం టాప్- 10 సెక్యూర్డ్ మెసేజింగ్ యాప్స్ ని బీబామ్ వెబ్ సైట్ వెల్లడించింది. వారి అంచనాల ప్రకారం టాప్-10 వెబ్ సైట్స్ ఇవే. టెలిగ్రామ్ ఆరో స్థానాన్ని దక్కించుకోగా.. వాట్సాప్ ఏడో స్థానంలో నిలిచింది.