దసరా, దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. వంటింటి వస్తువుల నుంచి లాప్టాప్ల వరకు ప్రతి దాని మీద భారీ ఎత్తున్న డిస్కౌంట్స్ ఇచ్చాయి. పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ భారీగా జరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఒకవేళ మళ్లీ ఆఫర్లు ఉంటే.. ఇయర్ సెండ్ సేల్స్ డిసెంబర్లో ఉండవచ్చు. కానీ అప్పటి వరకు ఆగలేం.. ఇప్పుడు ఇయర్‌ఫోన్స్ కొనాలి.. కానీ ఆఫర్లు లేవని బాధపడుతున్నారా.. అయితే మీ కోసమే ఓ బంపరాఫర్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో భాగాంగా 2 వేల రూపాయల విలువైన నెక్ బ్యాండ్‌ని 599కే అందిస్తోంది ఓ కంపెనీ. లాంచింగ్ ఆఫర్లో భాగంగా ఇలా తక్కువ ధరకే పొందవచ్చు. ఆ వివరాలు..
ఇండియన్ స్మార్ట్ వేరబుల్ కంపెనీ స్కాట్ తాజాగా.. నెకాన్ 101 పేరుతో బ్లూటూత్ నెక్ బ్యాండ్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్కాట్ నెకాన్ 101 నెక్ బ్యాండ్ లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, హెచ్డీ స్టీరియో సౌండ్, ఎన్‌హ్యాన్సడ్ బాస్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ నెక్ బ్యాండ్ 30 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ కలిగి ఉంటుంది. దీని వాస్తవ ధర 2000 రూపాయలు. కానీ లాంచింగ్ ఆఫర్లో భాగంగా ప్రస్తుతం ఈ నెక్‌బ్యాండ్‌ను రూ. 599లకే కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లాక్, బ్లూ రంగుల్లో లభిస్తోంది. ఈ నెక్‌బ్యాండ్ కొనాలనుకునేవారు.. స్వాట్లైఫ్స్టైల్.కామ్ అనే వెబ్సైట్ ద్వారా కొనొచ్చు.
ఈ స్కాట్ నెకాన్ 101 బ్లూటూత్ నెక్‌బ్యాండ్ వాస్తవ ధర రూ. 1990.. కానీ లాంచింగ్ ఆఫర్లో భాగంగా దీనిపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ సిలికాన్ మెటీరియల్‌తో తయారైంది. ఈ నెక్ బ్యాండ్ వాటర్, స్వెట్ రెసిస్టెన్సీ కలిగి ఉంటుంది. ఇందులో ఇంకా బ్లూటూత్ 5, 10 ఎంఎం ఆయో డ్రైవర్ యూనిట్, గేమింగ్ మోడ్, ఏఎన్సీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకా రెండు డివైజ్‌లను ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ నెక్‌బ్యాండ్‌ను కేవలం 40 నిమిషాలు చార్జింగ్ పెడితే 30 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. ప్రస్తుతం మీరు కొత్త ఇయర్ ఫోన్స్ కొనాలని భావిస్తే.. ఇప్పుడు ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోండి. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉండనుంది. కనుక త్వరపడండి.