ఎండాకాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉంటుందనేది తెలిసిందే. వీటి వాడకం వల్ల కరెంట్ ఛార్జీ కూడా ఎక్కువగానే వస్తుంది.
వేసవి కాలంలో ఎండల నుంచి సేదతీరేందుకు చాలా మంది ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా వాడుతుంటారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను అధికంగా వినియోగిస్తుంటారు. వీటి నుంచి వల్లే చల్లటి గాలితో ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం వల్ల కరెంట్ బిల్లు కూడా అధికంగా వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మామూలుగా ఫ్యాన్స్‌కు కరెంట్ అవసరం. ఆమధ్య వచ్చిన బ్యాటరీ ఫ్యాన్లకు కూడా విద్యుత్ అవసరం అయింది. ఛార్జింగ్ అయ్యాకే వాటిని వాడేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మరింత మెరుగైంది. విద్యుత్ అవసరం లేని ఫ్యాన్స్ అందుబాటులోకి వచ్చేశాయి. కరెంట్ అవసరం లేకుండా నడిచే సోలార్ ఫ్యాన్లు మార్కెట్లోకి వచ్చేశాయి.
సోలార్ సిస్టమ్ ఆధారంగా నడిచే ఈ ఫ్యాన్లు మీ మీద విద్యుత్ బిల్లు భారాన్ని తగ్గిస్తాయి. ‘వన్ ఫర్ ఆల్ ఎస్ఎస్-20 సోలార్ మల్టీపర్పస్ 12 వోల్ట్ డీసీ ఫ్యాన్’ ఇలా నడిచేదే. ఈ పోర్టబుల్ ఫ్యాన్‌లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఒకే బటన్‌తో దీన్ని నియంత్రించొచ్చు. కిచెన్, హాల్, బెడ్ రూమ్.. ఇలా ఎక్కడైనా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 28డీx26డబ్ల్యూx 16హెచ్ సైజులో ఈ సోలార్ ఫ్యాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కేవలం రూ.599 మాత్రమే. దీన్ని 2 శాతం తగ్గింపుతో రూ.589కి అమెజాన్ నుంచి కొనుగులో చేయొచ్చు. కరెంట్ అవసరం లేని మరో ఫ్యానే ‘లవ్లీ సోలార్ ఫ్యాన్ డీసీ 12 వోల్ట్ 6’. దీని అసలు ధర రూ.699. అమెజాన్‌లో దీన్ని 14 శాతం తగ్గింపుతో రూ.599కి సులభంగా కొనుగోలు చేయొచ్చు. దీనిపై ఒక సంవత్సరం వారెంటీ ఉంది.