టెక్ దిగ్గజం యాపిల్ ఐ ఫోన్లకు మార్కెట్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్కెట్ లోకి ఏ కొత్త మోడల్ వచ్చినా.. హాట్ కేకుల్లో అమ్ముడవుతాయి. వాటి ధరల పరంగా సమాన్య, మధ్యతరగతి వారికి కాస్త దూరంలో ఉన్నా కూడా ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే ఫోన్లలో ఐ ఫోన్ ఒకటి. ముఖ్యంగా డేటా భద్రత, హ్యాక్ చేసేందుకు అసాధ్యంగా ఉండటం వాటి ప్రధాన లక్షణం. ఫీచర్లు, కెమెరా, స్పెసిఫికేషన్ల విషయంతో ఐ ఫోన్ ను ఢీకొట్టడం చాలా కంపెనీలకు కష్టమైన పని. ధర విషయమే కాకుండా.. ఐవోఎస్‌ను హాండిల్ చేయడం కూడా చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. ఐ ఫోన్లకు ఉన్న డ్రాబ్యాక్స్ ఆ రెండే. ఇప్పుడు మార్కెట్ లో మరో అంశంలో ఐఫోన్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఐ ఫోన్ లో యూజర్లకు తెలియని ఎన్నో ఫీచర్లు ఉంటాయి.
ఐఫోన్ కొత్తగా పరిచయం చేసిన ఫీచర్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అదే బ్యాక్ ట్యాప్ ఆప్షన్. అది అన్ని ఫోన్లకు లేదులెండి. ఐ ఫోన్ 8 ఆపై మోడళ్లకు ఈ ఫీచర్ ను పరిచయం చేశారు. ఐఫోన్ కు బ్యాక్ సైడ్ ఉండే యాపిల్ లోగోను ట్యాప్ చేసి మీకు కావాల్సిన ఫీచర్‌కు షార్ట్ కట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఐఓఎస్ 14లో ఈ ఆప్షన్ పనిచేస్తుంది. దీనిని ఎనేబుల్ చేసేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఆ తర్వాత యాక్సెసబిలిటీని ఓపెన్ చేసి అందులో టచ్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. దానిని కిందకు స్క్రోల్ చేస్తే.. బ్యాక్ ట్యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాబ్ అని ఉంటుంది. అందులో మీకు నచ్చిన ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆ బ్యాక్ ట్యాప్ కు ఏ ఫీచర్ ను షార్ట్ కట్‌గా పెట్టుకోవాలో సెలక్ట్ చేసుకోవాలి. అదండి సంగతి.. మీకు ఈ ఆప్షన్ తెలియకపోతే వెంటనే బ్యాక్ ట్యాప్ ఎనేబుల్ చేసుకోండి.