వాట్సాప్.. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న ప్రతిఒక్కరికి ఈ మెసెంజర్ యాప్ గురించి బాగా తెలిసే ఉంటుంది. ప్రస్తుతం అంతా మెసేజ్‌లు, వీడియోకాల్ కోసం ఈ యాప్‌పైనే ఆధారపడుతున్నారు. కొందరైతే ఆడియో కాల్ కోసం వాట్సాప్‌నే ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనతికాలంలోనే వాట్సాప్ ఎంతో ఫేమస్ యాప్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఇన్‌స్టెంట్ మెసెంజర్ యాప్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వాట్సాప్‌కు సంబంధించి ఒక అలర్ట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే అక్టోబర్ నెల నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదంట.
అవును మీరు చదివింది నిజమే.. అక్టోబర్ నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ యాప్ పనిచేయడం మానేస్తుంది. అయితే అది ఆండ్రాయిడ్ ఫోన్లలో కాదులెండి. కొన్ని ఐవోఎస్ ఫోన్లలో వాట్సాప్ అక్టోబర్ నుంచి పనిచేయడం మానేస్తుందని WABetaInfo వారు చెబుతున్నారు. వారి చెప్పినదాన్ని బట్టి చూస్తే అక్టోబర్ 24నాటికి ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 మీద పని చేస్తున్న ఫోన్లలో వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. అందుకు సంబంధించిన హెచ్చరికలను సైతం ఆ ఐవోఎస్‌లు వాడుతున్న యూజర్లకు పంపుతున్నట్లు చెబుతున్నారు. ఐఫోన్ లో వాట్సాప్ సేవలను కొనసాగించాలి అని అనుకుంటే ఐవోఎస్ 12 లేదా తర్వాతి ఐవోఎస్‌కు అప్‌డేట్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారు.
అలా చేయని పక్షంలో అక్టోబర్ 24 నుంచి పాత ఐవోఎస్‌లు కలిగిఉన్న ఫోన్లలో వాట్సాప్ సేవలు పనిచేయవు. ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉన్న ఐఫోన్‌ను ఈ విధంగా అప్‌గ్రేడ్ చేసుకోండి. మొదటి మీ ఐఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ కి నావిగేట్ చేయండి. ఆ తర్వాత అక్కడ సాఫ్ట్ వేర్ అప్‌గ్రేడ్‌ని ఎంచుకోవాలి. అందులో వర్షన్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా మీ ఐఫోన్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీ ఐఫోన్‌లో నిరంతరాయంగా వాట్సాప్ సేవలను పొందవచ్చు. వాట్సాప్ సేవలు నిలిచిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.