ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండరేమో. భారతదేశంలో అయితే దాదాపుగా ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఈ సోషల్ మేసేజింగ్ యాప్ ఉంటుంది. ఈ మెసేజింగ్ యాప్ తరచూ అప్ డేట్స్ ఇస్తూ తమ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది.
వాట్సాప్.. ఈ సోషల్ మెసేజింగ్ యాప్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్స్ అవసరమే లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్లను కలిగి ఉన్న మెసేజింగ్ యాప్ ఇది. ఈ యాప్ ద్వారా కేవలం మెసేజ్ లు మాత్రమే కాకుండా.. ఆడియో కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ కూడా చేసుకునే వీలుంటుంది. చాలావరకు కంపెనీలు కూడా ఈ వాట్సాప్ నే తమ ఆఫీస్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నాయి. యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్స్ తెస్తుండే విషయం తెలిసిందే. అయితే ఆండ్రాయిడ్ యూజర్ల కోసమే ఈ ఫీచర్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఐవోఎస్ యూజర్ల కోసం ఈ మధ్య వాట్సాప్ ఎక్కువగా అప్ డేట్స్ ఇస్తోంది.
వాట్సాప్ నుంచి కనీసం నెలకు ఒకటైనా అప్ డేట్ వస్తుంది. అయితే వాటిలో మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసమే ఫీచర్స్ ఉంటూ ఉంటాయి. ఐవోఎస్ యూజర్ల కోసం అదే ఫీచర్ తీసుకురావాలంటే దాదాపుగా సంవత్సరం కాలం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పుడు వాట్సాప్ ఐవోఎస్ యూజర్లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఐఫోన్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్స్ తీసుకొచ్చింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరో కూల్ ఫీచర్ ని ఐవోఎస్ యూజర్ల కోసం తీసుకురాబోతోంది. అందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది.
ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ ఇప్పుడు షెడ్యూల్ గ్రూప్ కాల్ అనే ఫీచర్ ని తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఆ ఫీచర్ బేటా వర్షన్ టెస్టింగ్ లెవల్లో ఉంది. యాపిల్ టెస్ట్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కి ఎన్ రోల్ చేసుకున్న వారికి ఈ షెడ్యూల్డ్ గ్రూప్ కాల్ ఫీచర్ ని టెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఈ బేటా ప్రోగ్రామ్ లో ఎన్ రోల్ అయినవాళ్లు వాట్సాప్ ఓవోఎస్ వర్షన్ 23.4.0కు అప్ డేట్ చేసుకుంటే వారికి కాల్ బటన్ మీద ట్యాప్ చేసిన ప్రతిసారి గ్రూప్ కాల్ అనే ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి 32 మంది గ్రూప్ కాల్ లో పాల్గొనవచ్చు. ఏ టైమ్ మీరు ఈ కాల్ ని షెడ్యూల్ చేస్తే ఆ సమయానికి అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. జాయిన్ బటన్ కొట్టి ఆ గ్రూప్ కాల్ లో పాల్గొనవచ్చు.
ఈ ఫీచర్ అనేది కంపెనీలకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఒక టీమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరితో మాట్లాడేందుకు వీలుంటుందని చెబుతున్నారు. ఒకసారి కాల్ షెడ్యూల్ చేసిన తర్వాత ఎవరికీ మీటింగ్ కి సంబంధించిన లింక్స్ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ గ్రూప్ కాల్ కి ఒక టైటిల్ కూడా ఇవ్వచ్చు. అంటే అసలు ఏ పర్పస్ లో ఈ కాల్ ని షెడ్యూల్ చేశారు. అనేది యూజర్లకు తెలిసిపోతుంది. కార్పొరేట్ కంపెనీలకు ఈ షెడ్యూల్డ్ గ్రూప్ కాల్ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఐఫోన్ యూజర్లకోసం వాట్సాప్ తీసుకరాబోతున్న ఈ షెడ్యూల్డ్ గ్రూప్ కాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.