స్మార్ట్ ఫోన్లను మరింత స్మార్ట్ గా మార్చేందుకు మొబైల్ కంపెనీలు ఎప్పటి నుంచో కృష్టి చేస్తున్నాయి. పెరుగుతున్న పోటీని తట్టుకోవడం మాత్రమే కాకుండా వారి మొబైల్స్ ని భిన్నంగా చూపించేందుకు తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అన్ని కంపెనీలు సూపర్ ఛార్జెస్ ని తయారు చేయడం ప్రారంభించాయి.
స్మార్ట్ ఫోన్ల వినియోగం విరివిగా పెరిగిపోయింది. మార్కెట్ లోకి విభిన్నమైన ఫీచర్లు, టెక్నాలజీతో ఫోన్లు వస్తున్నాయి. ఫీచర్ల సంగతి పక్కన పెడితే వినియోగదారులు పెద్ద బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉండాలని కోరుకుంటారు. నిజానికి ఇప్పుడు అన్ని ఫోన్లు దాదాపుగా 2, 3 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయ్యేలా ఛార్జర్స్ ని డిజైన్ చేస్తున్నాయి. కానీ, వినియోగదారులను అంత సమయం కూడా వెయిట్ చేయించకూడదని, అన్ని కంపెనీల కంటే భిన్నంగా ఉండాలని 65 వాట్స్ ఛార్జింగ్, 100 వాట్స్ ఛార్జింగ్ అంటూ సూపర్ ఫాస్ట్ ఛార్జస్ ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ పోటీతో గంటల సమయం కాస్తా.. నిమిషాల్లోకి వచ్చేసింది.
అవును.. ఈ రోజుల్లో ఛార్జింగ్ కోసం ఫోన్ ని గంటల తరబడి ఛార్జర్ కి గుచ్చాల్సిన అవసరం లేదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఫోన్ 100 శాతం ఛార్జ్ అయ్యేలా సూపర్ ఫాస్ట్ ఛార్జర్స్ ని తీసుకొస్తున్నారు. ఇటీవలే రియల్ మీ కంపెనీ 240 వాట్స్ ఛార్జర్ ని విడుదల చేసింది. ఆ ఛార్జర్ సాయంతో రియల్ మీ ఫోన్ కేవలం 9 నిమిషాల 30 సెక్లలోనే ఫుల్ ఛార్జ్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో కూడా రియల్ మీ కంపెనీ విడుదల చేసింది. ఇప్పుడు ఛార్జింగ్ విషయంలో రియల్ మీ రికార్డును తాము బ్రేక్ చేశామని రెడ్ మీ సంస్థ ప్రకటించింది. తమ ఛార్జర్ సాయంతో ఫోన్ కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయినట్లు ప్రకటించారు.
Redmi announced 300W Charging
It can charge a 4100mAh🔋from 0% to 100% in just 5 minutes 😲 pic.twitter.com/1q6U2IEpxL
— Debayan Roy (Gadgetsdata) (@Gadgetsdata) February 28, 2023
రెడ్ మీ సంస్థ తమ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ని విడుదల చేసింది. ఈ 300 వాట్స్ ఛార్జర్ కి ‘ఇమ్మోర్టల్ సెకండ్ ఛార్జర్’ అని పేరు పెట్టారు. ఇది కొత్త టెక్నాలజీ కాదని ప్రస్తుతం ఉన్న రెడ్ మీ 12 ప్రో వేరియంట్ టెక్నాలజీలో కొన్ని మార్పులు చేసి 300 వాట్స్ ఛార్జర్ గా మార్చినట్లు చెప్పారు. దీని ద్వారా 4,100 ఎంఏహెచ్ బ్యాటరీని 43 సెక్లలోనే 10 శాతం ఛార్జ్ చేయచ్చని చెప్పారు. 2.13 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ, కేవలం 5 నిమిషాల్లోనే బ్యాటరీని 100 శాతం ఛార్జ్ చేయచ్చని చెప్పారు. ఈ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ రెడ్ మీ నోట్ 12 ప్రో+ మ్యాజిక్ వర్షన్ లో ఉంటుంది అని చెబుతున్నారు. భారత్ లో ఎప్పుడు ఈ ఛార్జర్ అందుబాటులో ఉంటుంది అనే విషయంపై క్లారిటీ లేదు. రెడ్ మీ సంస్థ రియల్ మీ రికార్డులను బ్రేక్ చేసిందంటూ టెక్ నిపుణులు చెబుతున్నారు.
Redmi’s 300W charging technology can fully charge Redmi Note 12 Pro+’s 4100 mAh battery in 5 minutes, which is a new world record!
• ~0 to 50%: 2.2 minutes
• ~0 to 100%: 5 minutes pic.twitter.com/5Wtw86CdpI— Alvin (@sondesix) February 28, 2023