కొత్త సంవత్సరం మొదలయ్యాక స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ పోటీపడి మరీ కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా అదే జాబితాలో చేరింది One Plus కంపెనీ. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రేమికులను ఆకర్షిస్తున్న అగ్రగామి మొబైల్ కంపెనీలలో వన్ ప్లస్ ఒకటి. అయితే.. One Plus 10 సిరీస్ నుండి మార్కెట్ లోకి కొత్త మోడల్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయింది.
ఇంతకీ వన్ ప్లస్ ఏ మోడల్ లాంచ్ చేయనుందంటే.. One Plus 10 Pro. అదికూడా ఈ నెల(జనవరి)లోనే 11వ తేదీన One Plus 10 Pro స్మార్ట్ ఫోన్ మొదటగా చైనాలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. అలాగే One Plus CEO పీట్ లావ్ తాజాగా 10 Pro డిజైన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.
జనవరి 11న One Plus 10, One Plus 10 Pro లను రిలీజ్ చేయనుంది. చైనాలో లాంచ్ అయ్యాక కొన్ని నెలలకు గ్లోబల్ లాంచ్ జరగనుందని సమాచారం. One Plus 10 Pro డిజైన్ ఆకర్షణీయంగా ఉందని చెప్పాలి. ఈ స్మార్ట్ ఫోన్ వోల్కానిక్ బ్లాక్ – ఫారెస్ట్ ఎమరాల్డ్ కలర్స్ లో వస్తుంది. దీనిలో హైలైట్ గా చెప్పుకోవాల్సింది కెమెరా బంప్. ఈ కెమెరా మాడ్యూల్ ని సిరామిక్ అనే ప్రీమియం మెటీరియల్‌తో డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. అది సాధారణ గాజు కంటే 13 రేట్లు ధృడంగా ఉంటుందని.. అందుకే దీర్ఘకాలం ఉంటుందని కంపెనీ తెలిపింది.
The OnePlus 10 Pro is much more than a sum of its parts. But for now, here are the specs. pic.twitter.com/iEQxgMWAkw
— Pete Lau (@PeteLau) January 5, 2022
ఈ 10 Pro స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల డిస్ ప్లే కలిగి QHD+ రిజల్యూషన్ తో.. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. One Plus 10 Pro మోడల్ ట్రిపుల్ కెమెరా సెటప్(50MP మెయిన్ + 48MP సెన్సార్ + 3X Zoom తో కూడిన 8MP)తో రాబోతుంది. 32MP సెల్ఫీ కెమెరా కలిగి, 5000mAh బ్యాటరీతో రానుంది. అలాగే One Plus 10 Pro స్టోరేజీ విషయానికి వస్తే.. 8GB RAM – 128/256GB కలిగి.. Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ తో అందుబాటులోకి వస్తుంది. ఇక దీని ధర చూసినట్లయితే.. రూ.68,999/- తో మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తుంది. మరి ఈ One Plus 10 Pro పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.