ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లు, అందులోనూ 5జీ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ కి తగ్గట్లుగా కంపెనీలు కూడా కొత్త కొత్త మోడళ్లను తెస్తున్నాయి. ఇప్పుడు నోకియా కూడా 5జీ స్మార్ట్ ఫోన్ తయారీని వేగవంతం చేసింది. తాజాగా ఎక్స్30 5జీ ఫోన్ ని ఇండియాలో లాంఛ్ చేసింది.
ప్రస్తుతం ప్రజలు అంతా స్మార్ట్ ఫోన్లు వాడుతున్న విషయం తెలిసిందే. వాటిలో కూడా మరీ ముఖ్యంగా 5జీ ఫోన్లను వాడుతున్నారు. అందుకే పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు 5జీ ఫోన్లను ఇప్పటికే లాంఛ్ చేశాయి. ఇంకా కొత్త కొత్త మోడళ్లను లాంఛ్ చేస్తూనే ఉన్నాయి. అయితే కీప్యాడ్ ఫోన్లు, ఫీచర్ ఫోన్ల తయారీలో కింగ్ అయిన నోకియా మాత్రం ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత బాగా వెనుకబడిన విషయం తెలిసిందే. తర్వాత మార్కెట్ లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ఆండ్రాయిడ్ ఫోన్లలను తయారు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ కంపెనీ సరికొత్త నోకియా ఎక్స్ 30 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేసింది. దానికి సంబంధించిన ధర, ఫీచర్ల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నోకియా నుంచి ఎక్స్ 30 5జీ పేరుతో స్మార్ట్ ఫోన్ విడుదల చేశారు. దీని ధరని రూ.48,999గా నిర్ణయించారు. అయితే ఆ ధర విన్న తర్వాత వినియోగదారులు మాత్రమే కాదు.. టెక్ నిపుణులు కూడా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే వాళ్లు చెప్పిన స్పెసిఫికేషన్లకు, వారు చెప్పిన ధరకు అస్సలు పొంతన లేకుండా ఉంది. ఇలాంటి పోటీ సమయంలో ఆ ఫీచర్లకు అంత ధర అంటే కొనే పరిస్థితి అస్సలు ఉండదని చెబుతున్నారు. ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. స్నాప్ డ్రాగన్ 695 5జీ, 6.43 ఫుల్ హెచ్ డీ, ఆమ్లోడ్ డిస్ ప్లే, 90 హెట్స్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ బ్రైట్ నెస్, గొరిల్లా గ్లాస్, అడ్రెనో 619ఎల్ జీపీయు, 8జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్, ఆండ్రాయిడ్ 12, 3 మేజర్ అప్ డేట్స్ ఇస్తామని చెప్పారు.
Nokia X30 launched at ₹54,999 , now check the specifications :
🤣 SD 695, LPDDR4X, UFS 2.2
• 6.43″ FHD+ 90Hz Amoled
• 50MP OIS + 13MP UW, 16MP selfie
🤣 Android 12 (3 Major updates)
• 4200mAh🔋, 33W charging
• IP67, NFC, WiFi 6
• Plastic back, Metal frame pic.twitter.com/BzvbObVNHP— Debayan Roy (Gadgetsdata) (@Gadgetsdata) February 15, 2023
50ఎంపీ కెమెరా, 13ఎంపీ అల్ట్రా వైడ్, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, 33వాట్స్ ఛార్జింగ్, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 100 రీసైకిల్డ్ అల్యూమీనియంతో తయారు చేశారు. దీని బ్యాక్ కవర్ ని 65 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో రూపొందించారు. ఈ ఫోన్ ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులోకి రానుంది. నోకియా వెబ్ సైట్ లో కస్టమర్లు రూ.1000 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ కొనుగోలుతో రూ.2,799 విలువైన నోకియా కంఫర్ట్ ఇయర్ బడ్స్ ని ఫ్రీగా అందిస్తున్నారు. రూ.2,999 విలువైన 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ని ఉచితంగా అందిస్తున్నారు.
Nokia X30 vs Realme 10 Pro: Battle of the Snapdragon 695 phones…#Nokia #NokiaX305G #Realme #Realme10ProSeries #realme10Pro pic.twitter.com/g1ahgNHCoX
— Smartprix (@Smartprix) February 15, 2023
ఈ ఫీచర్లు విన్న తర్వాత స్మార్ట్ ఫోన్ యూజర్లు అంతా ఈ ఫోన్ లాంఛ్ ను ట్వీట్ చేస్తూ అపహాస్యం చేస్తున్నారు. అసలు ఆ ధరకి, వాళ్లు అందించిన ఫీచర్లకు ఏమాత్రం అయినా పొంతన ఉందా? అని బాహటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే రియల్ మీ 10ప్రో 5జీ ఫోన్ ఫీచర్లను చూపిస్తూ ఇదే బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రియల్ మీలో కూడా నోకియా తరహా ప్రాసెసర్ ఉంది. పైగా 108 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 120 హెట్స్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉన్నాయి. దీని ధర కేవలం రూ.20,865 మాత్రమే. ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
With the most cutting-edge specifications, Nokia unveiled the X30 5G in India.
Android 12 and the Snapdragon 695 SOC cost just 5500/-
Yes, Just 5500/-, but when you place your order, you only need to multiply it by 10x 😂🫢
This is now my all-time favourite flagship killer device pic.twitter.com/ppOPAxEp86— ᴛʀᴏʟʟɪɴɢ ɪꜱ ᴀɴ ᴀʀᴛ (@Trolling_isart) February 15, 2023