ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, అవి కాస్త ఖరీదుగానే ఉంటాయి. కానీ, ఇప్పుడు బడ్జెట్ ఈవీ భారత్ లో లాంఛ్ అయింది. ఇది ధరలో మాత్రమే స్పెషల్ కాదు.. లుక్స్ పరంగా కూడా ఎంతో కొత్తగా ఉంది. పైగా ఇది సిటీ ట్రాఫిక్ కు ఎంతో సూటబుల్ గా ఉంటుంది. ఆటో వెళ్లే స్పేస్ లో ఈ కారుతో వెళ్లిపోవచ్చు.
MG కంపెనీకి చెందిన కార్లకు భారత్ లో చాలా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి విడుదలైన ఎన్నో మోడల్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ కంపెనీ తమ ఈవీ సెక్షన్ మీద కూడా దృష్టి సారించింది. ఇప్పటికే ఎంజీ కంపెనీ నుంచి ZS అనే ఈవీ మార్కెట్ లో ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఎంపీ కామెట్ అంటూ రెండో మోడల్ ని భారత్ లో గ్రాండ్ గా లాంఛ్ చేసింది. నిజానికి ఈ ఎంజీ కామెట్ లాంఛింగ్ కి ముందు నుంచే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అది అలా వైరల్ అవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కారు లాంఛ్ అయిన తర్వాత దాని ధర, వివరాలు చూసిన తర్వాత మరింతగా వైరల్ అవుతోంది.
ఎంజీ మోటర్ ఇండియా కంపెనీ తమ రెండో ఈవీ కారుని ఇండియాలో గ్రాండ్ గా లాంఛ్ చేసింది. ఈ ఎంజీ కామెట్ లాంఛింగ్ కంటే ముందు నుంచే వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఎంజీ కామెట్ లుక్స్ పరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పైగా దీని ధర రూ.7.98 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ తోనే అందిస్తున్నారు. నిజానికి ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఈ ఎంజీ కామెట్ మోడల్ అతి తక్కువ ధరలో లభిస్తున్న కారుగా చెప్పచ్చు. ఎందుకంటే దీనికి దగ్గర మోడల్స్, రైవల్స్ గా భావిస్తున్న టాటా టియాగో ధర రూ.8.69 లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి రూ.11.99 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంది. అలాగే సిట్రోఎన్ ఈ-సీ3 మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.11.50 లక్షల నుంచి రూ.12.43 లక్షల వరకు ఉంది.
ఈ కారులో లుక్స్ గురించి కచ్చితంగా ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే భారత్ లో అందుబాటులో ఉన్న అతి చిన్న కారు ఎంజీ కామెట్. దీనిని BICO(బిగ్ ఇన్ సైడ్ కాంపాక్ట్ అవుట్ సైడ్) తరహాలో తయారు చేశారు. డైమెన్షన్స్ లో ఈ కారు టాటా నానో కంటే కూడా చిన్నగా ఉంది. ఎంజీ కామెట్ లెంగ్త్ 2,974 ఎంఎం(3 మీటర్ల కంటే కూడా తక్కువ), విడ్త్ 1,505 ఎంఎం, హైట్ 1,631 ఎంఎంగా ఉంది. దీనిని ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందు కోసం రూపొందించినట్లుగా ఉంటుంది. వాళ్ల టార్గెట్ కస్టమర్స్ కూడా వాళ్లనే తెలుస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.98 లక్షలుగా ఉంది. అంటే దీనిని కచ్చితంగా బడ్జెట్ ఈవీ అనే చెప్పచ్చు. ఈ కారు ఏప్రిల్ 27 నుంచి టెస్ట్ డ్రైవ్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే మే 15 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
ఇంక ఈ ఎంజీ కామెట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది 2 డోర్స్ కలిగిన 4 సీటర్ ఎలక్ట్రిక్ కార్. బయట నుంచి చూడటానికి చాలా అంటే చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ, లోపల మాత్రం నలుగురు వ్యక్తులు ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. అయితే ఈ కారు నుంచి ఎక్కువ బూట్ స్పేస్, స్టోరేజ్ లాంటివి కోరుకోకండి. హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఇండికేటర్స్ అన్నీ ఎల్‌ఈడీ లైట్స్ వస్తున్నాయి. దీనికి 12 ఇంచెస్ వీల్స్ వస్తున్నాయి. 10.25 ఇంచెస్ ఇన్ స్ట్రుమెంటర్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఫుల్ టచ్ స్క్రీన్ లభిస్తోంది. రేర్ సీట్ ని పుల్ చేసి మీరు బ్యాక్ రోలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రంట్ సీట్స్ రిక్లైన్ చేస్తే బ్యాక్ కూర్చున్న వారికి అంత లెగ్ రూమ్ ఉన్నట్లుగా అనిపించదు.
MG Comet EV launched in India
At an Introductory Starting Ex-Showroom Price of Rs. 7,98,000
17.3 KWH Battery
230 KM ARAI Range
Test Drive Starts from 27th April
Booking 15th May pic.twitter.com/6RkQOmpkO0
— Utsav Techie (@utsavtechie) April 26, 2023
టిల్ట్ స్ట్రీరింగ్, మాన్యువల్ ఏసీ ఉంది. ఇది ఐస్మార్ట్ టెక్నాలజీతో వస్తోంది. ఇందులో 55 ఫీచర్స్ ఉన్నాయి. ఇది 230 కిలోమీటర్స్ రేంజ్ తో వస్తోంది. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. పార్కింగ్ కెమెరా కూడా ఉంది. ముఖ్యంగా ఎంజీ కామెంట్ లో స్ట్రీరింగ్, కంట్రోల్స్ బాగా ఆకట్టుకుంటాయి. స్టీరింగ్ కి లెఫ్ట్ సైడ్ మీటర్ కంట్రోల్స్, కుడివైపు మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ ఉన్నాయి. 3.3 కిలో వాట్స్ ఛార్జర్ తో ఈ కారు 7 గంటల్లో 0 నుంచి ఫుల్ ఛార్జ్ అవుతుంది. 5 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయచ్చు. ఎంజీ కంపెనీ లెక్కల ప్రకారం ఈ కారు ఛార్జింగ్ ఛార్జెస్ ప్రతి వెయ్యి కిలోమీటర్లకు కేవలం రూ.519 మాత్రమే ఖర్చు అవుతుందని వెల్లడించారు. అన్ని విధాలుగా ఈ ఎంజీ కామెట్ బడ్జెట్ లో బెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా ఆటో మొబైల్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
Buckle up, it’s about to get wild 🌻🚙
Get hyped for the most fascinating ride of your life 🌼🚘 3 days to go until we unveil MG Comet EV!#CometEV #UrbanMobility #ComingSoon #MorrisGarages #MGMotorIndia pic.twitter.com/mITK8nrI9A
— Morris Garages India (@MGMotorIn) April 23, 2023