ఇప్పటివరకు రోడ్లపై నడిచే బైక్‌లను చూసిన మనం.. రాబోవు రోజుల్లో ఆకాశంలో రుయ్.. రుయ్.. మంటూ దూసుకెళ్లే బైక్‌లను చూడవచ్చు. అమెరికన్ ఏవియేషన్ కంపెనీ ‘జెట్‌ప్యాక్’ ఈ ఆలోచనను నిజం చేసింది. ఇప్పటికే.. ఈ బైక్‌కు సంబంధించి విమానయాన పరీక్షలను విజయవంతం పూర్తిచేసిన జెట్‌ప్యాక్ కంపెనీ.. బుకింగ్స్ కూడా మొదలు పెట్టింది. గాల్లో ఎగిరే ఈ బైక్‌కు ‘స్పీడర్‘ అని పేరు పెట్టారు. దీని ధర ఎంత..? ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి..? ఎప్పుడు అందుబాటులోకి రానుంది వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కార్లు, బైక్‌లు గాల్లో ఎగురుతూ వెళ్తుంటే ఎంత బాగుంటుంది ఆలోచించిన వారే. ఇప్పుడు ఆ కల వాస్తవ రూపం దాల్చనుంది. కాకుంటే.. సామాన్యులకు గాల్లో ఎగరాలన్నా కోరిక తీరకపోవచ్చు. ఎందుకంటే.. దీని ప్రారంభ ధర అక్షరాలా రూ.3.15 కోట్లు. రాబోవు 2-3 ఏళ్లలో మార్కెట్‌లోకి రానున్న ఈ బైక్‌లకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఎగిరే ఈ బైక్ గాలిలో దాదాపు 100 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. ఒకేసారి గాలిలో 30 నుంచి 40 నిమిషాల పాటు ఎగురగలదు. అమెరికాకు చెందిన జెట్ ప్యాక్ కంపెనీ ఈ బైక్‌ను తయారుచేసింది. ప్రస్తుతం ఈ కంపెననీ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తోంది.
136 కిలోల బరువున్న ఈ బైక్.. 272 కిలోల బరువును మోయగలదు. ఈ బైక్‌ను రిమోట్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. తొలి డిజైన్‌లో నాలుగు టర్బైన్‌లు ఉండేవి. కాగా, తుది ఉత్పత్తిలో 8 టర్బైన్లను కలిగి ఉంటుంది. నిజానికి ఈ ఎగిరే బైక్ ఒక ఎయిర్ యుటిలిటీ వాహనం. అంటే.. మెడికల్ ఎమర్జెన్సీ, అగ్నిప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో దీనిని వాడుకొని మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే.. మిలిటరీ మార్కెట్ కోసం కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌గా మానవరహిత వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది కంపెనీ. రాబివు 2-3 ఏండ్లలో ఈ బైకులు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గాల్లో ఎగిరే బైక్ ఎలా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
World gone completely mad.
Flying motorbike.
“When it’s certified by the FAA, the Jetpack Aviation Speeder will be a flying street bike that uses 8 tiny-but-powerful jet engines to cruise 60 mph for about 30 minutes.” https://t.co/I2CofqL7ue
Hope it never gets certified— AirportWatch (@AirportWatch) January 4, 2023