ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం అయిపోయింది. ఫోన్లు, వాచ్‌లు ఎలా అయితే స్మార్ట్ అయ్యాయో.. టీవీలు కూడా సాధారణం నుంచి స్మార్ట్ గా మారాయి. ఇప్పుడు ఎవరు టీవీ కొనాలన్నా స్మార్ట్ టీవీల వైపే చూస్తున్నారు. నిజానికి చాలా కంపెనీలు మామూలు టీవీలను తయారు చేయడం ఎప్పుడో మానేశాయి. అయితే ఏ టీవీ కొనాలి? తక్కువ ధరలో స్మార్ట్ టీవీ ఏదైనా ఉందా! అని ఆలోచించే వారికి ఈ న్యూస్ శుభవార్తగానే చెప్పొచ్చు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ‘ఇన్ఫినిక్స్’ చవకైన స్మార్ట్ టీవీ ‘ఇన్ఫినిక్స్ 32వై1’ను లాంచ్ చేసింది.
ఇన్ఫినిక్స్ 32వై1 ధర, ఆఫర్స్:
ఈ స్మార్ట్ టీవీ జులై 18 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానుంది. అసలు ధర రూ.16,999 కాగా, లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.8,999గా నిర్ణయించారు. అంతేకాదు.. కొనుగోలు చేసే సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లైతే అదనంగా 10% డిస్కౌంట్ లభించనుంది. తద్వారా 1,500 తగ్గనుంది. దీంతో రూ.7,499కే ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.
Latest movies, entertaining shows and trending videos sab ke saath enjoy karo, with Infinix 32Y1 Smart TV with built-in apps like YouTube, Amazon Prime and Sony Liv.
Infinix 32Y1 Smart TV for just ₹8,999! 🤩
Sale starts 18th July, only on @Flipkart https://t.co/2MyXgo6BQo pic.twitter.com/rP9P7YoHFw
— Infinix India (@InfinixIndia) July 12, 2022
ఇన్ఫినిక్స్ 32వై1 స్పెసిఫికేషన్స్:
వైఫై, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ల్యాన్, ఆప్టికల్, మిరాకాస్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్‌బిల్ట్‌గా యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జీ5, ఆజ్‌తక్, సోనీ లివ్, ఎరోస్ నౌ, హంగామా, ప్లెక్స్, యప్‌టీవీ యాప్‌లు రానున్నాయి.
— Govardhan Reddy (@gova3555) July 14, 2022
ఇది కూడా చదవండి: boAt: ‘లైవ్ క్రికెట్ స్కోర్’ ఫీచర్ తో boAt స్మార్ట్‌వాచ్.. ధర ఎంతంటే?
ఇది కూడా చదవండి: Smart Tv: రూ.30 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీల వివరాలు!