ఇప్పుడు మార్కెట్ లో అన్నీ స్మార్ట్ టీవీలో అయిపోయాయి. మీరు కొనాలి అనుకున్న పాతకాలం టీవీలు దొరకడం లేదు. అయితే స్మార్ట్ టీవీ అంటే ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్ లోకి ఒక బడ్జెట్ స్మార్ట్ టీవీ వచ్చింది.
ఇప్పుడు మార్కెట్ లోకి అన్నీ స్మార్ట్ టీవీలే వస్తున్నాయి. హెచ్ డీ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీ, ర్యామ్, స్టోరేజ్ అంటూ చాలానే ఫీచర్లతో టీవీలు వస్తున్నాయి. కాకపోతే వాటి ధర కూడా అలాగే ఉంటుంది. బడ్జెట్ లో, దిగువ మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో టీవీలు అంటే కాస్త కష్టమనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి ఒక బడ్జెట్ స్మార్ట్ టీవీ అందుబాటులోకి రాబోతోంది. దాని ధరని కేవలం రూ.6,999గా నిర్ణయించారు. దీనిలో ర్యామ్- స్టోర్జ్, కాస్టింగ్, డాల్బీ, ఓటీటీ యాప్స్ సపోర్ట్ అంటూ చాలానే ఫీచర్స్ ఉన్నాయి. ఈ ధరకు ఇన్ని ఫీచర్స్ ఇవ్వడంపై టెక్ నిపుణులు సైతం వాహ్ వా అంటున్నారు.
ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి ఓ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. ఈ ఇన్ఫినిక్స్ 24Y1 ఇంచెస్ టీవీని కేవలం రూ.6,999కే అందిస్తున్నారు. ఈ 24 ఇంచెస్ టీవీలో 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, హెచ్ డీ రెడీ డిస్ ప్లే, 250 నిట్స్ బ్రైట్ నెస్, 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ ఆడియో సపోర్ట్, 16వాట్స్ స్పీకర్స్. పెద్ద పెద్ద స్మార్ట్ టీవీల తరహాలో ఈ టీవీ రిమోట్ లో కూడా యూట్యూబ్, అమెజాన్ ఓటీటీ యాప్స్ బటన్స్ కూడా ఇస్తున్నారు. హెచ్ డీఎంఐ పోర్ట్స్, యూఎస్ బీ పోర్ట్స్ కూడా ఇస్తున్నారు. కంప్యూటర్, ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్ నుంచి కాస్టింగ్ చేసేందుకు బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ మిర్రరింగ్ కూడా అందుబాటులో ఉంది. మార్చి 15 నుంచి ఈ స్మార్ట్ టీవీ అందుబాటులోకి రానుంది.